Ben Duckett: 'భార‌త్‌ను ఫైన‌ల్లో ఓడిస్తామ‌న్నావుగా.. ఇప్పుడేమైంది'.. డ‌కెట్‌పై భార‌త అభిమానుల ట్రోల్స్‌!

England Star Ben Duckett Trolled Brutally For Old India Comment After Champions Trophy 2025 Exit
  • ఆఫ్ఘ‌నిస్థాన్ చేతిలో కంగుతిన్న ఇంగ్లండ్‌
  • ఛాంపియ‌న్స్ ట్రోఫీ నుంచి ఇంటిదారి ప‌ట్టిన వైనం
  • ఇటీవ‌ల భార‌త్‌తో మూడు వ‌న్డేల సిరీస్‌లో బెన్ డకెట్ కీల‌క వ్యాఖ్య‌లు 
  • తాము ఇక్క‌డికి ఛాంపియ‌న్స్ ట్రోఫీ కోసం వ‌చ్చామ‌న్న క్రికెట‌ర్‌
  • ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్లో భార‌త్‌ను ఓడిస్తామ‌ని వ్యాఖ్య‌
  • ఇప్పుడు టోర్నీ నుంచి ఇంగ్లండ్ నిష్క్ర‌మ‌ణ‌తో డ‌కెట్‌పై ట్రోలింగ్‌
ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భాగంగా నిన్న ఇంగ్లండ్ ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఆఫ్ఘ‌నిస్థాన్ చేతిలో కంగుతిన్న విష‌యం తెలిసిందే. త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్‌లో ప‌రాజ‌యంతో ఇంగ్లీష్ జ‌ట్టు టోర్న‌మెంట్ నుంచి వైదొలిగింది. ఈ నేప‌థ్యంలో ఇంగ్లండ్ ఆట‌గాడు బెన్ డ‌కెట్‌పై భార‌త అభిమానులు ఘెరంగా ట్రోల్ చేస్తున్నారు. 

ఇటీవ‌ల భార‌త్‌తో మూడు వ‌న్డేల సిరీస్‌లో భాగంగా వ‌రుస‌గా రెండు మ్యాచ్‌లు ఓడిపోయాక డ‌కెట్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. "మేము ఈ సిరీస్‌లో 3-0 తేడాతో ఓడినా పెద్ద మ్యాట‌ర్ కాదు. మేము ఇక్క‌డికి ఛాంపియ‌న్స్ ట్రోఫీ కోసం వ‌చ్చాం. టీమిండియాను ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్లో త‌ప్ప‌కుండా మ‌ట్టిక‌రిపిస్తాం. అప్పుడు ఈ ఓట‌మిని ఎవ‌రూ గుర్తుపెట్టుకోరు" అని అన్నాడు. 

కానీ, ఇప్పుడు ఛాంపియ‌న్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ జ‌ట్టు సెమీస్ కూడా చేర‌కుండానే ఇంటిముఖం ప‌ట్టింది. దాంతో ఇప్పుడు డ‌కెట్‌పై భార‌త అభిమానులు ఓ రేంజ్‌లో ట్రోలింగ్ చేస్తున్నారు. "పాపం.. భార‌త్‌ను ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్లో ఓడిస్తామ‌న్న‌ బెన్ డ‌కెట్ క‌ల చెదిరిపోయిందిగా. అందుకు కార‌ణ‌మైన ఆఫ్ఘ‌నిస్థాన్‌పై చాలా కోపంగా ఉంది" అని ఓ నెటిజ‌న్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. "సరే సరేలే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయా.. అన్ని స‌ర్దుకో డ‌కెట్‌" అంటూ మ‌రొక‌రు ట్రోల్ చేశారు.  
Ben Duckett
England
Team India
Cricket
Sports News

More Telugu News