Job Fair: విశాఖ గీతం యూనివర్సిటీలో మార్చి 5,6 తేదీల్లో కేరీర్ ఫెయిర్

Career Fair In Gitam University on March 5th and 6th
  • నాస్కామ్, ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా కెరీర్ ఫెయిర్ నిర్వహ‌ణ‌
  • 10వేల మంది యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాలు
  • కేరీర్ ఫెయిర్ పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి నారా లోకేశ్‌
విశాఖపట్నం గీతం యూనివర్సిటీలో మార్చి 5, 6 తేదీల్లో నాస్కామ్, ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా కెరీర్ ఫెయిర్ నిర్వహించనున్నారు. ఈ కెరీర్ ఫెయిర్‌లో ఐటీ, ఐటీఈఎస్ 49 కంపెనీలతో యువతీ, యువకులకు సుమారు 10వేల ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ ఆవిష్కరించారు. 

2024, 2025లో ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువతీ, యువకులు రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సంద‌ర్భంగా మంత్రి పిలుపునిచ్చారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో నాస్కామ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ ఉప్మిత్ సింగ్, నేషనల్ లీడ్ ఉదయ్ శంకర్, ఏపీ లీడ్ ప్రవీణ్ కుమార్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.
Job Fair
Gitam University
Andhra Pradesh
Nara Lokesh

More Telugu News