Viral Videos: బెంగ‌ళూరులో న‌డిరోడ్డుపై ప్రేమికుల బ‌రితెగింపు.. వైర‌ల్‌ అవుతున్న వీడియో!

Bengaluru Woman Sits On Bikes Fuel Tank Hugs Helmetless Rider Video goes Viral
    
బెంగ‌ళూరులో న‌డిరోడ్డుపై ప్రేమికుల జంట రెచ్చిపోయింది. ఓ యువ‌కుడు బైక్ న‌డుపుతుండ‌గా యువ‌తి ముందువైపు నుంచి ఫ్యూయ‌ల్ ట్యాంక్‌పై అత‌డిని గ‌ట్టిగా కౌగిలించుకొని కూర్చుంది. బెంగ‌ళూరులోని స‌ర్జాపుర మెయిన్ రోడ్డులో ఓ ప్రేమ జంట ఇలా రొమాన్స్ చేసుకుంటూ క‌నిపించ‌డంతో ఓ వ్య‌క్తి త‌న మొబైల్‌లో వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పెట్టాడు. 

దీంతో వీడియో నెట్టింట‌ వైర‌ల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజ‌న్లు ప్రేమికుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇలాంటి వారిని అస‌లు క్ష‌మించ‌కూడ‌ద‌ని, ఇది పూర్తిగా సిగ్గులేనితనమ‌ని, పైగా హెల్మెట్ లేకుండా రద్దీగా ఉండే రోడ్డుపై ఇలా నిర్ల‌క్ష్యంగా ప్ర‌యాణిస్తున్న ఆ జంట‌పై పోలీసులు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్‌ చేస్తున్నారు. 
Viral Videos
Bengaluru
Lovers

More Telugu News