GOA Tourism: ఇడ్లీ, సాంబార్ అంటూ గోవా ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

Goa MLA controversial comments on Idli Sambar
  • ఇటీవలి కాలంలో గోవాకు తగ్గిన పర్యాటకులు
  • బెంగళూరు నుంచి వచ్చిన వాళ్లు వడా పావ్ లు అమ్ముతున్నారన్న ఎమ్మెల్యే లోబో
  • దీని వల్లే గోవాకు పర్యాటకులు తగ్గారంటూ విచిత్ర వ్యాఖ్యలు
ఇటీవలి కాలంలో గోవాలో పర్యాటకుల సంఖ్య తగ్గిపోతోంది. ఈ అంశంపై గోవా స్థానిక ఎమ్మెల్యే మైఖేల్ లోబో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నార్త్ గోవాలోని కలంగూట్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... బెంగళూరు నుంచి వచ్చిన వాళ్లు బీచ్ లో వడా పావ్ లు అమ్ముతున్నారని... మరికొందరు ఇడ్లీ, సాంబార్ విక్రయిస్తున్నారని విమర్శించారు. 

దీనివల్లే గత రెండేళ్లుగా గోవాకు విదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గిపోయిందని అన్నారు. యుద్ధం కారణంగా రష్యా, ఉక్రెయిన్ నుంచి పర్యాటకులు గోవాకు రావడం లేదని తెలిపారు. మైఖేల్ లోబో వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
GOA Tourism

More Telugu News