Australia vs Afghanistan: ఆసీస్, ఆఫ్ఘన్ మ్యాచ్‌కు వరుణుడి గండం.. రద్దయితే సెమీస్‌కు చేరేదెవరంటే..!

- ఈరోజు లాహోర్ వేదికగా ఆసీస్, ఆఫ్ఘన్ మధ్య కీలక మ్యాచ్
- ఈ గేమ్‌లో గెలిచిన జట్టు ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా నేరుగా సెమీస్‌కు
- లాహోర్‌లో ఈరోజు 71 శాతం వర్షం పడే అవకాశం
- మ్యాచ్ రద్దయితే సెమీస్‌కు ఆసీస్.. ఆఫ్ఘన్ ఇంటికి
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్‌లో జరుగుతున్న మ్యాచ్‌లను వరుణుడు వెంటాడుతున్నాడు. ఇప్పటికే రావల్పిండి వేదికగా జరగాల్సిన రెండు మ్యాచ్‌లు (ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్థాన్) వర్షార్పణం అయ్యాయి. ఈరోజు లాహోర్‌లో జరగాల్సిన ఆసీస్, ఆఫ్ఘనిస్థాన్ కీలక మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. ఈ గేమ్‌లో గెలిచిన జట్టు ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా నేరుగా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోనుంది. దీంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం.
ఒకవేళ మ్యాచ్ రద్దయితే..?
ఇంగ్లండ్‌పై అద్భుతమైన విజయంతో జోరుమీదున్దన ఆఫ్ఘనిస్థాన్.. లాహోర్ వేదికగా జరిగే మ్యాచ్‌లో కూడా గెలిచి సెమీ ఫైనల్‌కి దూసుకెళ్లాలని చూస్తోంది. కానీ, వారి ఆశలపై వరుణుడు నీళ్లు చల్లేలా ఉన్నాడు. ఎందుకంటే ఈ మ్యాచ్ జరిగే లాహోర్‌లో ఈరోజు (శుక్రవారం) 71 శాతం వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో మ్యాచ్ రద్దయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
ఒకవేళ మ్యాచ్ రద్దయితే ఇరుజట్లకు చెరో పాయింట్ లభిస్తాయి. అప్పుడు ఆస్ట్రేలియా 4 పాయింట్లతో నేరుగా సెమీస్‌కు వెళ్లిపోతుంది. అలాగే 3 పాయింట్లు ఉన్న ఆఫ్ఘన్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తుంది. అదే సమయంలో ఇప్పటికే 3 పాయింట్లతో ఉన్న దక్షిణాఫ్రికా... ఇంగ్లండ్‌తో జరగాల్సిన మ్యాచ్‌తో సంబంధం లేకుండా సెమీ ఫైనల్‌కి చేరుతుంది. దీనికి కారణంగా ఆఫ్ఘన్ (-0.999) కంటే సఫారీ (+2.140)లకు నెట్ రన్‌రేట్ అధికంగా ఉంది.
సో... ఆఫ్ఘనిస్థాన్ అభిమానులు మాత్రం ఈ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించకూడదని, తమ జట్టు గెలిచి సెమీస్ కు వెళ్లాలని ప్రార్థిస్తున్నారు. కాగా, 2024లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో ఆసీస్‌కు ఆఫ్ఘన్ షాకిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ కావాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.