Posani Krishna Murali: ఖైదీ నెంబర్ 2261... పోసాని కృష్ణమురళి వ్యాఖ్యలు లైంగిక వేధింపుల కిందకు వస్తాయన్న కోర్టు

Posani number in jail is 2261
  • పోసానికి 14 రోజుల రిమాండ్ విధించిన రైల్వే కోడూరు కోర్టు
  • మహిళలపై పోసాని వ్యాఖ్యలు లైంగిక వేధింపులే అన్న కోర్టు
  • పోసానికి బెయిల్ నిరాకరించిన కోర్టు
సినీ నటుడు పోసాని కృష్ణమురళిని రాజంపేట సబ్ జైలుకు తరలించారు. ఆయనకు రైల్వే కోడూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. పోసానికి ఖైదీ నంబర్ 2261ని జైలు అధికారులు కేటాయించారు. 

పోసానిని నిన్న రాత్రి 9 గంటల వరకు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్ లో విచారించారు. అనంతరం రాత్రి 9.30 గంటలకు కోర్టులో ప్రవేశపెట్టారు. ఉదయం 5 గంటల వరకు కోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. పోసాని తరపున పొన్నవోలు సుధాకర్ వాదనలు వినిపించారు. పోసానికి బెయిల్ ఇవ్వాలని కోరారు. అయితే అందుకు నిరాకరించిన న్యాయమూర్తి... పోసానికి రిమాండ్ విధించారు. మార్చి 13 వరకు పోసాని రిమాండ్ ఖైదీగా ఉండనున్నారు. మరోవైపు విచారణ సందర్భంగా పోసానిపై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళల గురించి పోసాని చేసిన వ్యాఖ్యలు లైంగిక వేధింపుల కిందకే వస్తాయని పేర్కొంది.
Posani Krishna Murali
Tollywood

More Telugu News