Nara Lokesh: మంగళగిరి-తెనాలి-నారా కోడూరు రోడ్లకు మహర్దశ... లోకేశ్ ఆదేశాలతో డీపీఆర్ షురూ

Lokesh orders for DPR to road development near Mangalagiri
  • కూటమి ప్రభుత్వం వచ్చాక రోడ్ల నిర్మాణం, మరమ్మతులు
  • మంగళగిరి- తెనాలి-నారా కోడూరు మధ్య 4 లేన్ రోడ్డుగా విస్తరణ
  • రూ.1 కోటి 12 వేలు విడుదల
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంగళగిరి-తెనాలి-నారా కోడూరు మధ్య రోడ్లకు మహర్దశ పట్టింది. ఇప్పటికే గుంటూరు జిల్లాలో కీలక రోడ్లు, ప్రజలు నిత్యం రాకపోకలు అధికంగా సాగించే మార్గాలైన తెనాలి-గుంటూరు వయా నారా కోడూరు, తెనాలి-విజయవాడ వయా మంగళగిరి రహదారుల విస్తరణకు కూటమి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 

తెనాలి నుంచి గుంటూరు మార్గంలో నారా కోడూరు వరకు, తెనాలి-విజయవాడ మార్గంలో మంగళగిరి హైవే వరకు 4 లేన్లుగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. మంత్రి నారా లోకేశ్ ఆదేశాలతో అధికారులు డీపీఆర్ రూపకల్పన పనులు ప్రారంభించారు. 

మంగళగిరి- తెనాలి-నారా కోడూరు మధ్య 40.05 కి.మీ రహదారులను నాలుగు వరుసలకు విస్తరణ కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) తయారీ పనులను శుక్రవారం ప్రారంభించారు. ఇందు కోసం ప్రభుత్వం రూ. 1 కోటి 12 వేలు విడుదల చేసింది. దీనితో అధికారులు, ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి డీపీఆర్ నివేదిక సిద్ధం చేస్తున్నారు. విస్తరణకు అవసరమైన కొలతలు సేకరిస్తున్నారు. 
Nara Lokesh
Road Development
Mangalagiri
TDP-JanaSena-BJP Alliance

More Telugu News