IIT Baba: టీవీ ఇంటర్వ్యూలో ఐఐటీ బాబాకు చేదు అనుభవం

- మహా కుంభమేళాలో ఐఐటీ బాబాగా పేరు తెచ్చుకున్న అభయ్ సింగ్
- నిన్న నోయిడాలో ఓ టీవీ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో ఆయనపై దాడి
- దాంతో పోలీసులకు ఫిర్యాదు.. తనకు న్యాయం చేయాలంటూ బైఠాయింపు
ప్రయాగ్‌రాజ్‌లో ఇటీవల ముగిసిన మహా కుంభమేళాలో ఐఐటీ బాబాగా అభయ్ సింగ్ బాగా ఫేమస్ అయ్యారు. అయితే, శుక్రవారం నాడు ఓ టీవీ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. కొందరు ఆయనపై దాడికి పాల్పడినట్లు సమాచారం. దాంతో అభయ్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పూర్తి వివరాల్లోకి వెళితే... నిన్న నోయిడాలోని ఓ ప్రైవేట్ ఛానెల్‌కు అభయ్ సింగ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సమయంలో కొందరు కాషాయ దుస్తులు ధరించి అక్కడికి వచ్చారు. వారు తనతో అనుచితంగా ప్రవర్తించడంతో పాటు తనపై దాడికి పాల్పడినట్లు ఐఐటీ బాబా ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆయన.. తనకు న్యాయం చేయాలంటూ పోలీస్ అవుట్ పోస్టు ముందు బైఠాయించారు. దీంతో పోలీస్ అధికారులు ఆయనకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు.
ఇదిలాఉంటే.. ఈ ఘటనకు ముందు అభయ్ సింగే సదరు ఛానెల్ యాంకర్‌పై దాడి చేసినట్లు తెలిసింది. ఇక హర్యానాకు చెందిన ఆయన ఐఐటీ బాంబేలో ఏరోస్పెస్ ఇంజినీరింగ్ చదివినట్లు తెలుస్తోంది. కొంతకాలం ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేసిన అభయ్ సింగ్.. ఆ తర్వాత ఆధ్యాత్మికం వైపు మళ్లారు. ఈ క్రమంలో ఇటీవల మహా కుంభమేళాలో ఓ న్యూస్ ఏజెన్సీకి ఇంటర్వ్యూ ఇవ్వడంతో ఐఐటీ బాబాగా పాప్యులర్ అయ్యారు.