Asha Workers: ఆశా వ‌ర్క‌ర్ల‌పై ఏపీ ప్ర‌భుత్వం వ‌రాల జ‌ల్లు

The Upper Age Limit For Asha Workers Increased To 62 Years in Andhra Pradesh
  • ఆశా వ‌ర్క‌ర్ల గ‌రిష్ఠ‌ వ‌యోప‌రిమితిని 62 ఏళ్ల‌కు పెంపు
  • ఆశా కార్య‌క‌ర్త‌లంద‌రికీ ప్ర‌యోజ‌నం చేకూర్చేలా గ్రాట్యుటీ చెల్లింపు
  • ఈ మేర‌కు సీఎం చంద్ర‌బాబు నాయుడు నిర్ణ‌యిం
  • ఇక‌పై మొద‌టి 2 ప్ర‌స‌వాల‌కు 180 రోజులు వేత‌నంతో కూడిన సెల‌వులు
ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం ఆశా వ‌ర్క‌ర్ల‌పై వ‌రాల జ‌ల్లు కురిపించింది. ఆశా వ‌ర్క‌ర్ల గ‌రిష్ఠ‌ వ‌యోప‌రిమితిని 62 ఏళ్ల‌కు పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది. అలాగే ఆశా వ‌ర్క‌ర్లంద‌రికీ ప్ర‌యోజ‌నం చేకూరేలా గ్రాట్యుటీ చెల్లించాల‌ని సీఎం చంద్ర‌బాబు నాయుడు నిర్ణ‌యించారు. 

అంతేగాక మొద‌టి 2 ప్ర‌స‌వాల‌కు ఇక‌పై 180 రోజులు వేత‌నంతో కూడిన సెల‌వులు కూడా ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. వీటికి సంబంధించిన ఉత్త‌ర్వులు త్వ‌ర‌లోనే వెలువ‌డ‌నున్నాయి. 

కాగా, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దాదాపు 42,752 మంది ఆశా కార్య‌క‌ర్త‌లు ఉన్నారు. వీరిలో గ్రామాల్లో 37,017 మంది ఉంటే... ప‌ట్ట‌ణాల్లో 5,735 మంది ఉన్నారు. ప్ర‌స్తుతం వారికి నెల జీతం కింద రూ. 10 వేలు అందుతోంది. ఇక స‌ర్వీసు ముగింపులో గ్రాట్యుటీ కింద రూ. 1.5 లక్ష‌లు అందే అవ‌కాశం ఉంది.  

Asha Workers
AP Govt
Chandrababu
Andhra Pradesh

More Telugu News