Donald Trump: అమెరికాలో ఇంగ్లీష్ ని అధికార భాష చేసే దిశగా ట్రంప్ అడుగులు

Donald Trump to sign the executive order to make English official language
  • అమెరికాలో మొత్తం రాష్ట్రాల సంఖ్య 50
  • ఇంగ్లీష్ ని అధికారిక భాషగా స్వీకరించిన 32 రాష్ట్రాలు
  • టెక్సాస్ వంటి రాష్ట్రాల్లో అధికారిక భాషకు సంబంధించి సమస్యలు
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ ఊహించని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రమాణస్వీకారం చేసిన రోజునే పెద్ద సంఖ్యలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.

అమెరికా చరిత్రలోనే తొలిసారిగా ఇంగ్లీష్ ని అధికారిక భాషగా చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ట్రంప్ సంతకం చేయబోతున్నారని వైట్ హౌస్ కి చెందిన ఒక అధికారి తెలిపారు. 

అమెరికాలో మొత్తం 50 రాష్ట్రాలు ఉంటే... 32 రాష్ట్రాలు ఇంగ్లీష్ ని తమ అధికారిక భాషగా స్వీకరించాయి. టెక్సాస్ వంటి రాష్ట్రాల్లో భాషకు సంబంధించి సమస్య ఉంది. టెక్సాస్ లో స్పానిష్ మాట్లాడేవారు ఎక్కువగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ తీసుకునే నిర్ణయంపై ఇతర రాష్ట్రాలు ఎలా స్పందిస్తాయనే ఆసక్తి నెలకొంది. 2015లో న్యూయార్క్ లో జరిగిన ఒక సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ... మనది ఇంగ్లీష్ మాట్లాడే దేశమని అన్నారు. 
Donald Trump
USA
English

More Telugu News