Seethakka: ఆ రోజున లక్షమంది మహిళలతో సభ: సీతక్క

Seethakka says will arrange public meeting with one lakh women
  • మహిళా దినోత్సవం రోజున పలు కొత్త పథకాలకు శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడి
  • ఇందిరా మహిళా శక్తి పాలసీని ముఖ్యమంత్రి విడుదల చేస్తారన్న మంత్రి
  • పట్టణాల్లో మహిళా సంఘాల బలోపేతానికి కీలక ప్రకటన రావొచ్చని వెల్లడి
మహిళా దినోత్సవం (మార్చి 8) రోజున సికింద్రాబాద్‌లోని పరేడ్ మైదానంలో సుమారు లక్ష మంది మహిళలతో సభను నిర్వహిస్తామని తెలంగాణ మంత్రి సీతక్క వెల్లడించారు. మహిళా దినోత్సవం రోజున పలు కొత్త పథకాలకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. ఈ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరా మహిళా శక్తి పాలసీని విడుదల చేస్తారని వెల్లడించారు.

నారాయణపేట జిల్లాలో పూర్తిగా మహిళలే పెట్రోలు బంకులు నిర్వహిస్తున్నారని, మిగతా 31 జిల్లాల్లోనూ పూర్తిగా మహిళలే పెట్రోలు బంకులు నిర్వహించేలా చమురు రంగ సంస్థలతో ఆ రోజున ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుందని ఆమె తెలిపారు. మహిళా సంఘాల కోసం 32 జిల్లాల్లో 64 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లను ముఖ్యమంత్రి వర్చువల్‌గా ప్రారంభిస్తారని తెలిపారు.

వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేస్తారని తెలిపారు. ప్రమాదవశాత్తు మరణించిన మహిళల కుటుంబాలకు రూ.40 కోట్ల బీమా చెక్కులను అందిస్తారని తెలిపారు. పట్టణాల్లో మహిళా సంఘాలను బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేసే అవకాశముందని తెలిపారు. 
Seethakka
Telangana
Congress

More Telugu News