Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ: టాస్ పడింది.... టేబుల్ టాపర్ ఎవరు?... టీమిండియానా, న్యూజిలాండా?

New Zealand has won the toss against India in Champions Trophy
  • ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు చివరి లీగ్ మ్యాచ్
  • దుబాయ్ లో టీమిండియా × న్యూజిలాండ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కివీస్
  • చెరో రెండు విజయాలతో సమవుజ్జీలుగా ఉన్న భారత్, న్యూజిలాండ్
ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్-ఏ లో నేడు చివరి లీగ్ మ్యాచ్ లో టీమిండియా, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ రెండు జట్లు ఇప్పటికే సెమీస్ చేరినప్పటికీ, ఈ మ్యాచ్ ఫలితంతో టోర్నీ సెమీస్ లో ఏ జట్టు ఎవరితో తలపడుతుందన్నది నిర్ధారణ అవుతుంది.. కాగా, నేడు భారత్, కివీస్ మ్యాచ్ కు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా నిలుస్తోంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. గ్రూప్-ఏ నుంచి భారత్, న్యూజిలాండ్ చెరో రెండు విజయాలతో సమవుజ్జీలుగా ఉన్నాయి. ఇవాళ్టి మ్యాచ్ తో టేబుల్ టాపర్ ఎవరో తేలనుంది.

టీమిండియా 
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.

న్యూజిలాండ్
మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైకేల్ బ్రేస్వెల్, మాట్ హెన్రీ, కేల్ జేమీసన్, విలియమ్ ఓరూర్కీ

కాగా, నేటి మ్యాచ్ టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీకి 300వ వన్డే మ్యాచ్. దాంతో అందరి కళ్లు కోహ్లీపైనే ఉండనున్నాయి. ఈ మ్యాచ్ లో కోహ్లీ సెంచరీ బాదాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Champions Trophy 2025
Team India
New Zealand
Toss
Dubai

More Telugu News