Meenakshi Chowdhary: ఏపీ బ్రాండ్ అంబాసిడర్ గా మీనాక్షి చౌదరి అంటూ వార్తలు... ఫ్యాక్ట్ చెక్ ఇదిగో!

AP Fact Check condemns that Meenakshi Chowdhary being appointed as AP Brand Ambassador
  • ఏపీ ఉమెన్ ఎంపవర్ మెంట్ బ్రాండ్ అంబాసిడర్ గా మీనాక్షి అంటూ ప్రచారం
  • ఇది ఫేక్ అంటూ క్లారిటీ ఇచ్చిన ఏపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం
  • తప్పుడు పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా సాధికారత బ్రాండ్ అంబాసిడర్ గా టాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరిని నియమించారంటూ వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే టాపిక్ కనిపిస్తోంది. దీనిపై ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ (నిజ నిర్ధారణ) విభాగం స్పందించింది. 

మీనాక్షి చౌదరిని ఏపీ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఇది పూర్తిగా ఫేక్ అని స్పష్టం చేసింది. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం పేరుతో తప్పుడు పోస్టులు పెడుతున్నవారిపై, ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తున్న వారిపై చట్టప్రకారం చర్యలు ఉంటాయని ఏపీ ఫ్యాక్ట్ చెక్ హెచ్చరించింది.
Meenakshi Chowdhary
AP Brand Ambassador
Fact Check
Fake News

More Telugu News