Gaza Cease Fire: నేటి నుంచే రంజాన్ మాసం... ఇజ్రాయెల్-హమాస్ మధ్య మరో ఒప్పందం

Israel and Hamas agreed to continue ceasefire due to Ramadan season
  • ఇజ్రాయెల్, హమాస్ మధ్య నిన్నటితో ముగిసిన కాల్పుల విరమణ ఒప్పందం
  • నేటి నుంచి రంజాన్ మాసం
  • రంజాన్ మాసం కావడంతో కాల్పుల విరమణ కొనసాగించాలన్న అమెరికా
  • అమెరికా ప్రతిపాదనకు ఇజ్రాయెల్, హమాస్ మద్దతు 
నేటి నుంచి రంజాన్ మాసం కొనసాగుతున్న నేపథ్యంలో... ఇజ్రాయెల్, హమాస్ మిలిటెంట్ గ్రూప్ మధ్య తాజాగా మరో ఒప్పందం కుదిరింది. గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపునకు ఇజ్రాయెల్, హమాస్ పరస్పరం అంగీకరించాయి.  

గాజాలో కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్-హమాస్ మధ్య కుదిరిన తొలి దశ ఒప్పందం మార్చి 1వ తేదీతో ముగిసింది. రంజాన్ మాసం కావడంతో కాల్పుల విరమణ కొనసాగిస్తే బాగుంటుందని అమెరికా సూచించింది. అమెరికా ప్రతిపాదనకు మద్దతు ఇస్తున్నట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. అటు, హమాస్ కూడా ఆమోదం తెలిపింది.
Gaza Cease Fire
Israel
Hamas
Ramadan
USA

More Telugu News