Viral Videos: అక్ష‌ర్ ప‌టేల్ కాళ్లు మొక్క‌బోయిన కోహ్లీ.. ఇదిగో వీడియో!

Virat Kohli Touches Axar Patels Feet After Spinner Gets Kane Williamsons Wicket
  • దుబాయ్ వేదిక‌గా భార‌త్, కివీస్ పోరు 
  • 250 ప‌రుగుల ల‌క్ష్యాన్ని కాపాడుకుని విజ‌యం సాధించిన టీమిండియా
  • భార‌త స్పిన్న‌ర్లు చెల‌రేగ‌డంతో తోక ముడిచిన‌ కివీస్ బ్యాట‌ర్లు
  • 5 వికెట్ల‌తో భార‌త విజ‌యంలో వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి కీల‌క పాత్ర‌
  • కీల‌క‌మైన కేన్ మామ వికెట్ తీసిన అక్ష‌ర్ ప‌టేల్‌
  • ఆ స‌మ‌యంలో అక్ష‌ర్ కాళ్ల‌ను తాకేందుకు ప్రయ‌త్నించిన కోహ్లీ
దుబాయ్ వేదిక‌గా ఆదివారం నాడు జ‌రిగిన ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఆఖ‌రి లీగ్ మ్యాచ్‌లో భారత్‌, న్యూజిలాండ్ త‌ల‌ప‌డిన విష‌యం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా 250 ప‌రుగుల ల‌క్ష్యాన్ని కాపాడుకుని విజ‌యం సాధించ‌డం విశేషం. భార‌త స్పిన్న‌ర్లు చెల‌రేగ‌డంతో కివీస్ బ్యాట‌ర్లు కంగారు ప‌డ్డారు. 250 ప‌రుగుల టార్గెట్‌తో బ‌రికిలోకి దిగిన బ్లాక్ క్యాప్స్ 205 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. దీంతో రోహిత్ సేన 44 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. మిస్ట‌రీ స్పిన్న‌ర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి త‌న 10 ఓవ‌ర్ల కోటాలో కేవ‌లం 42 ర‌న్స్ మాత్ర‌మే ఇచ్చి 5 వికెట్లు ప‌డ‌గొట్ట‌డం ద్వారా భార‌త్ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. 

అటు మ‌రో స్పిన్న‌ర్ అక్ష‌ర్ ప‌టేల్ కీల‌క‌మైన కేన్ విలియమ్సన్ వికెట్ తీశాడు.  ఈ సంద‌ర్భంగా స్టార్ ప్లేయ‌ర్‌ విరాట్ కోహ్లీ, అక్షర్ పటేల్ ఒక ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న చోటుచేసుకుంది. భారత్ క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టినప్పటికీ, కేన్ మామ మాత్రం మ‌రో ఎండ్‌లో ప‌రుగులు సాధించ‌డం ఆప‌లేదు. అత‌ని జోరు చూస్తుంటే ఒకా‌నొక ద‌శ‌లో కివీస్‌ను విజ‌య తీరాల‌కు చేర్చ‌డం ఖాయమ‌ని అంద‌రూ భావించారు. కానీ, అక్షర్ ఓ అద్భుత‌మైన బంతితో అత‌డిని బోల్తా కొట్టించాడు. విలియ‌మ్స‌న్‌ వ్యక్తిగత స్కోరు 81 ర‌న్స్ వ‌ద్ద ఉన్న‌ప్పుడు అక్ష‌ర్ విసిరిన బంతిని ముందు‌కు వ‌చ్చి ఆడే క్ర‌మంలో స్టంపౌట్ అయ్యాడు. దాంతో భార‌త శిబిరం ఊపిరి పీల్చుకుంది. 

అయితే, కేన్ మామ వికెట్ తీసిన అక్ష‌ర్ ప‌టేల్ కాళ్ల‌ను తాకేందుకు విరాట్ కోహ్లీ ప్రయ‌త్నించాడు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుటున్నాయి. ఈ ఫ‌న్నీ వీడియోపై నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు. కాగా, నిన్న‌టి మ్యాచ్‌లో అక్ష‌ర్ ఆల్‌రౌండ‌ర్ ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆకట్టుకున్నాడు. మొద‌ట బ్యాటింగ్‌లో జ‌ట్టు క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు క్రీజులోకి వ‌చ్చి అమూల్య‌మైన 47 ప‌రుగులు చేశాడు. ఆ త‌ర్వాత బౌలింగ్‌లో కీల‌క‌మైన ఒక వికెట్ తీశాడు. అలాగే ఫీల్డింగ్‌లో ఓ అద్భుత‌మైన క్యాచ్ కూడా ప‌ట్టాడు. 
Viral Videos
Virat Kohli
Axar Patel
Kane Williamson
Cricket
Team India
Champions Trophy 2025

More Telugu News