Gottipati Ravi Kumar: ఉచిత విద్యుత్ కు రూ. 12,400 కోట్లు ఖర్చు చేస్తున్నాం: మంత్రి గొట్టిపాటి

Gottipati Ravi Kumar say govt is committed to farmer welfare
  • రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న గొట్టిపాటి
  • 40,336 కనెక్షన్లు మంజూరు చేశామని వెల్లడి
  • డిస్కమ్ ల మధ్య రేట్లలో అంతరం లేకుండా చూస్తామన్న మంత్రి
రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి తెలిపారు. కూటమి ప్రభుత్వం రాగానే 40,336 వ్యవసాయ కనెక్షన్ లు మంజూరు చేశామని తెలిపారు. 22,709 కనెక్షన్ లు రైతులకు ఇచ్చి, ఇప్పటికే వినియోగంలోకి తెచ్చామని వెల్లడించారు. ఒక్కో వ్యవసాయ కనెక్షన్ కు రూ. 2.60 లక్షలు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ఉచిత విద్యుత్ కు రూ. 12,400 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. 

గత ప్రభుత్వంలో వేర్వేరు రేట్లకు ట్రాన్స్ ఫార్మర్లు కొనుగోలు చేశారని... ఇకపై అలా జరగకుండా చూస్తామని గొట్టిపాటి చెప్పారు. ట్రాన్స్ ఫార్మర్ల దొంగతనాలు జరిగితే వెంటనే ఫిర్యాదు చేసి వివరాలు ఇస్తే... కొత్త ట్రాన్స్ ఫార్మర్లు ఇస్తామని తెలిపారు. డిస్కమ్ ల మధ్య రేట్లలో అంతరం లేకుండా చూస్తామని చెప్పారు.
Gottipati Ravi Kumar
Telugudesam

More Telugu News