Atchannaidu: శాసనమండలిలో బొత్సకు దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చిన అచ్చెన్నాయుడు... వీడియో ఇదిగో!

Atchannaidu gives fitting reply to Botsa in AP Legislative Council
  • అచ్చెన్న మాట్లాడుతుండగా బొత్స అభ్యంతరం
  • ఉండమ్మా... అంటూ అచ్చెన్న వ్యాఖ్యలు
  • బొత్స తన గురించి వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారని వెల్లడి
  • ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యాడు అంటూ మాట్లాడుతున్నారని వివరణ
  • మీలాగా గాలి వీస్తే గెలవడం, గాలి వీయకపోతే ఓడిపోవడం తన చరిత్రలో లేదని స్పష్టీకరణ
ఏపీ శాసనమండలి సమావేశాలలో ఇవాళ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఓ అంశంలో వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతుండగా, మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. 

దాంతో అచ్చెన్నాయుడు స్పందిస్తూ... ఉండమ్మా, ఎవరైనా మాట్లాడొచ్చు... వాళ్లు, వీళ్లు మాత్రమే మాట్లాడాలని లేదు... ఎవరైనా స్పందించి మాట్లాడొచ్చు... సమష్టి బాధ్యతతో మాట్లాడొచ్చు... మేం చెప్పింది తప్పయితే దానికి నువ్వు మాట్లాడాలి... మేం మాట్లాడకూడదు అంటే అది తప్పు అంటూ బదులిచ్చారు. 

అచ్చెన్న ఈ క్రమంలో బొత్సకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. "అధ్యక్షా... ఒక్క నిమిషం టైమ్ ఇవ్వండి అధ్యక్షా. గౌరవనీయ బొత్స సత్తిబాబు గారు నా గురించి వ్యక్తిగతంగా మాట్లాడారు. ఏదో ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యాడు అంటూ మాట్లాడారు. 

నేను నిరంతరం ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తిని. మీలాగా గాలి వీస్తే గెలవడం, గాలి వీయకపోతే ఓడిపోవడం ఎప్పుడూ నా లైఫ్ లో లేదు. గాలి వీచినా, గాలి వీయకపోయినా... ఎలాంటి క్లిష్ట సమయంలో అయినా గెలిచే వ్యక్తిని నేను. నాకెప్పుడూ పదవుల మీద వ్యామోహం లేదు. పదవి ఉన్నా, పదవి లేకపోయినా నిరంతరం ప్రజల కోసం పనిచేసే తత్వం నాది" అంటూ అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. 

కాగా, గత ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ ఓటమిపాలైన సంగతి తెలిసిందే.
Atchannaidu
Botsa Satyanarayana
AP Legislative Council
TDP
YSRCP

More Telugu News