Teacher MLC Election: ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు: ఓట్ల లెక్కింపులో కొనసాగుతున్న ఎలిమినేషన్

- ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎన్నికలు
- నేడు ఓట్ల లెక్కింపు
- ఆరు రౌండ్ల పాటు కొనసాగనున్న లెక్కింపు
ఉత్తరాంధ్ర జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కౌంటింగ్ ప్రక్రియలో ప్రస్తుతం ఎలిమినేషన్ కొనసాగుతోంది. రెండో రౌండ్ లో అభ్యర్థి శివప్రసాదరావు ఎలిమినేట్ అయ్యారు. మూడో రౌండ్ లో అభ్యర్థి పద్మావతి ఎలిమినేట్ అయ్యారు. నాలుగో రౌండ్ పూర్తయ్యే సరికి అభ్యర్థి శ్రీనివాసులుకు 7,230 ఓట్లు, అభ్యర్థి రఘువర్మకు 6,850 ఓట్లు లభించాయి.
కాగా, మ్యాజిక్ ఫిగర్ 10,068 ఓట్లు సాధించిన అభ్యర్థి విజేతగా నిలుస్తాడు. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఆరు రౌండ్లు ఉంటాయి.
కాగా, మ్యాజిక్ ఫిగర్ 10,068 ఓట్లు సాధించిన అభ్యర్థి విజేతగా నిలుస్తాడు. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఆరు రౌండ్లు ఉంటాయి.