ICC Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్స్‌లో ఎదురే లేని భారత్.. టీమిండియాకు అద్భుత రికార్డు!

- గత 27 ఏళ్లుగా టోర్నీలో జరిగిన సెమీస్‌లలో ఓటమిలేని భారత జట్టు
- 2000, 2002, 2013, 2017 సెమీ ఫైనళ్లలో విజయాలు నమోదు చేసిన భారత్
- మొత్తంగా ఐదుసార్లు సెమీస్‌కు వెళితే.. నాలుగుసార్లు విజయఢంకా
- ఇవాళ ఆసీస్‌తో జరిగే సెమీఫైనల్లోనూ అదే రిపీట్ చేయాలని కోరుకుంటున్న ఫ్యాన్స్
ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్స్‌లో టీమిండియా అద్భుతమైన రికార్డు కలిగి ఉంది. గత 27 ఏళ్లుగా ఈ టోర్నీలో జరిగిన సెమీస్‌లో భారత జట్టుకు ఓటమి అనేదే లేదు. సెమీ ఫైనల్స్‌కు వెళ్లిన ప్రతీసారి గెలిచి సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది.
2000, 2002, 2013, 2017 సెమీ ఫైనళ్లలో విజయాలు నమోదు చేసి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇవాళ ఆస్ట్రేలియాతో జరగబోయే సెమీఫైనల్లోనూ అదే రిపీట్ చేయాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు.
ఇక మంగళవారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత జట్టు తలపడనుంది.
కాగా, భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్‌కు చేరుకోవడం ఇది ఆరోసారి. ఇంతకుముందు ఐదుసార్లు సెమీస్ ఆడిన టీమిండియా నాలుగు సార్లు విజేతగా నిలిచింది. 1998లో ఒకసారి మాత్రం వెస్టిండీస్ చేతిలో పరాజయం పాలైంది.
చివరిసారిగా 2017లో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ ఆడింది. బర్మింగ్‌హామ్‌లో బంగ్లాదేశ్‌ను తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించింది. ఆ తర్వాత చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఫైనల్ ఆడింది. కానీ, ఫైనల్లో టీమిండియాకు భంగపాటు ఎదురైంది. దాంతో మూడో టైటిల్ చేజారింది. కాగా, మెన్ ఇన్ బ్లూ 2002, 2013 ఎడిషన్లలో విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్స్‌లో భారత్ ఫలితాలు ఇలా..

- వెస్టిండీస్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమి (1998; ఢాకా)
- దక్షిణాఫ్రికాపై 95 పరుగుల తేడాతో విజయం (2000; నైరోబి)
- దక్షిణాఫ్రికాపై 10 పరుగుల తేడాతో విజయం (2002; కొలంబో)
- శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో విజయం (2013; కార్డిఫ్)
- బంగ్లాపై 9 వికెట్ల తేడాతో విజయం (2017; బర్మింగ్ హామ్)