Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్: టీమిండియాపై టాస్ గెలిచిన ఆసీస్

Australia won the toss against India in Champions Trophy Semifinal
  • ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు తొలి సెమీఫైనల్
  • దుబాయ్ వేదికగా టీమిండియా × ఆస్ట్రేలియా
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కంగారూలు
ఛాంపియన్స్ ట్రోఫీలో ఇవాళ తొలి సెమీఫైనల్లో టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. దుబాయ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ రిపోర్ట్ కూడా టాస్ నెగ్గితే బ్యాటింగ్ ఎంచుకోవడమే మంచి నిర్ణయం అని చెబుతోంది. 

టాస్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ... తాము ఈ కీలక మ్యాచ్ కోసం అన్ని విధాలుగా సన్నద్ధమయ్యామని చెప్పాడు. మొదట బ్యాటింగ్ చేసేందుకైనా, లేదా ఛేజింగ్ చేసేందుకైనా తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నాడు. ఒక్కోసారిటాస్గెలిస్తే ఏది ఎంచుకోవాలో తెలియక గందరగోళానికి గురవుతామని, ఇప్పుడా బాధ లేదని, టాస్ ఓడిపోవడమే మంచిదైందని అన్నాడు. ఇక గత మ్యాచ్ లో ఆడిన జట్టునే బరిలో దింపుతున్నామని తెలిపాడు. 

టాస్ గెలిచిన ఆసీస్ సారథి స్టీవ్ స్మిత్ పిచ్ గురించి చెబుతూ... పిచ్ చూస్తుంటే బ్యాటింగ్ కు అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తోందని అభిప్రాయపడ్డాడు. తమ జట్టులో రెండు మార్పులు చేశామని... మాథ్యూ షార్ట్ స్థానంలో కూపర్ కనోలీ... స్పెన్సర్ జాన్సన్ స్థానంలో తన్వీర్ సంఘా జట్టులోకి వచ్చారని వెల్లడించాడు. 

టీమిండియా
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.

ఆస్ట్రేలియా
స్టీవ్ స్మిత్ (కెప్టెన్), కూపర్ కనోలీ, ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), అలెక్స్ కేరీ, గ్లెన్ మ్యాక్స్ వెల్, బెన్ డ్వార్షూయిస్, నేథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘా.
Champions Trophy 2025
Team India
Australia
Semifinal
Dubai

More Telugu News