Supreme Court: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు... తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

Supreme Court notices to Telangana government in MLAs defection case
  • అసెంబ్లీ సెక్రటరీ, ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు
  • మార్చి 22లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశం
  • తదుపరి విచారణ మార్చి 25కి వాయిదా
పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను ఈరోజు సుప్రీంకోర్టు విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. మార్చి 22లోగా నోటీసులకు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 25కి వాయిదా వేసింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ ధర్మాసనం ఈ పిటిషన్ ను విచారించింది. 

విచారణ సందర్భంగా జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య విధానాలకు సరైన సమయం అవసరమని వ్యాఖ్యానించారు. మీరు నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం కావాలో చెప్పాలని అన్నారు. రీజనబుల్ టైమ్ అంటే ప్రస్తుత అసెంబ్లీ కాల పరిమితి ముగిసేంతవరకా? అని ప్రశ్నించారు. 
Supreme Court
MLAs
Defection
Telugudesam
BRS

More Telugu News