Bus Accident: బైక్ ను తప్పించబోయి బోల్తాపడిన బస్సు.... వీడియో ఇదిగో!

Bus overturned while trying to avoid a bike in Maharashtra
 
మహారాష్ట్రలో ఓ బస్సు బోల్తా పడిన ఘటన సీసీ కెమెరాలకు చిక్కింది. లాతూర్-నాందేడ్ జాతీయ రహదారిపై ఈ యాక్సిడెంట్ చోటుచేసుకుంది. అడ్డుగా వచ్చిన బైక్ ను తప్పించబోయి బస్సు బోల్తా పడింది. బస్సు గనుక నేరుగా వచ్చి ఉంటే బైక్ పై ఉన్న వారికి తీవ్ర ప్రమాదం జరిగేది. 

అసలేం జరిగిందంటే... అదే రూట్లో బస్సు వేగంగా వస్తోన్న సమయంలో... బైక్ పై ఉన్న వారు అవతలివైపు రోడ్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. బైక్ ను ఢీకొట్టే ప్రమాదం ఉండడంతో బస్సు డ్రైవర్ వెంటనే స్టీరింగ్ తిప్పేశాడు. అయితే బస్సు వేగంగా వెళుతుండడంతో నియంత్రించడం సాధ్యం కాలేదు. ఇవతలివైపు రోడ్డులోకి వచ్చేసిన బస్సు అదే ఊపులో బోల్తా పడింది. 

ఈ ఘటనలో 36 మందికి గాయాలు కాగా, వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆరుగురు తీవ్ర గాయాలకు గురయ్యారని వైద్యులు తెలిపారు.

బైక్ పై ఉన్న వారు బస్సును చూసుకోకుండా రోడ్డు క్రాస్ చేసే ప్రయత్నం చేయడం వల్లే ఈ ఘటన జరిగినట్టు సీసీ టీవీ ఫుటేజ్ చూస్తే అర్థమవుతోంది. ఈ ప్రమాదంలో  గాయపడిన వారిని లాతూర్ లోని విలాస్ రావ్ దేశ్ ముఖ్ ఆసుపత్రికి తరలించారు.
Bus Accident
Bike
Maharashtra

More Telugu News