Age Limit: ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్... కానీ...!

AP Govt extends age limit for job recruitments with a condition
  • నాన్ యూనిఫాం ఉద్యోగాలకు వయో పరిమితి 34 ఏళ్ల నుంచి 42 ఏళ్లకు పెంపు
  • యూనిఫాం ఉద్యోగాలకు వయో పరిమితి రెండేళ్లు పెంపు
  • అయితే ఈ ఏడాది సెప్టెంబరు లోపు రిక్రూట్ మెంట్లకే ఈ వెసులుబాటు అమలు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు తియ్యని కబురు చెప్పింది. వివిధ ఉద్యోగ అవకాశాలకు నిరుద్యోగులకు వయో పరిమితి పెంచుతున్నట్టు వెల్లడించాయి. నాన్ యూనిఫాం ఉద్యోగాలకు వయోపరిమితి 34 నుంచి 42 ఏళ్లకు పెంచారు. యూనిఫాం ఉద్యోగాలకు ప్రస్తుతం ఉన్న వయో పరిమితిని రెండేళ్లు పెంచారు. 

అయితే, ఈ ఏడాది సెప్టెంబరు లోపు జరిగే రిక్రూట్ మెంట్లకు మాత్రమే ఈ వెసులుబాటు అమల్లో ఉంటుందని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
Age Limit
Jobs
Andhra Pradesh

More Telugu News