Posani Krishna Murali: పోసానికి 14 రోజుల రిమాండ్ విధించిన కర్నూలు కోర్టు

Actor Posani remanded for 14 days by Kurnool court
  • చంద్రబాబు, పవన్, లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసాని
  • రాష్ట్రవ్యాప్తంగా 17 కేసుల నమోదు
  • ఆదోనిలో నమోదైన కేసులో ఈ నెల 18 వరకు రిమాండ్
  • కర్నూలు జిల్లా కోర్టుకు తరలింపు
ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి కర్నూలు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నారా లోకేశ్, వారి కుటుంబ సభ్యులపై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కర్నూలు జిల్లా ఆదోని మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో ఇలాంటి కేసులోనే అరెస్టై గుంటూరు జిల్లాలో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసానిని తమకు అప్పగించాలంటూ ఆదోని పోలీసులు జైలు సిబ్బందిని కోరారు. వారు అనుమతినివ్వడంతో పోసానిని అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షల అనంతరం కర్నూలుకు తరలించారు. అక్కడ న్యాయమూర్తి ఎదుట పోసానిని ప్రవేశపెట్టారు. 

ఇరు పక్షాల వాదనల అనంతరం పోసానికి న్యాయమూర్తి ఈ నెల 18 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీచేశారు. దీంతో ఆయనను కర్నూలు జిల్లా జైలుకు తరలించారు. మరోవైపు, నరసరావుపేటలో నమోదైన కేసులో పోసానికి కోర్టు ఈ నెల 13 వరకు రిమాండ్ విధించింది. పోసానిపై రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 17 కేసులు నమోదయ్యాయి.
Posani Krishna Murali
Kurnool District
YSRCP
Telugudesam

More Telugu News