Virat Kohli: భారత్ గెలుపు.. విరుష్క జోడీ రియాక్షన్ వీడియో వైరల్!

- తొలి సెమీఫైనల్లో ఆసీస్‌పై భారత్ అద్భుత విజయం
- సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించిన కేఎల్ రాహుల్
- డ్రెస్సింగ్ రూమ్‌లో టీమిండియా ఆటగాళ్ల సంబరాలు
- స్టాండ్‌లో కూర్చున్న భార్య అనుష్కను చూస్తూ గెలిచేశామంటూ కోహ్లీ ఎక్స్‌ప్రెషన్
- చప్పట్లతోనే కోహ్లీని అభినందించిన అనుష్క
- ప్రస్తుతం విరుష్క జోడీ రియాక్షన్ వీడియో నెట్టింట వైరల్
దుబాయ్ వేదికగా నిన్న జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీఫైనల్లో ఆసీస్‌పై భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా నిర్దేశించిన 265 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విరాట్ కోహ్లీ మరోసారి 84 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి తోడు అక్షర్, శ్రేయస్, రాహుల్, హార్దిక్, రోహిత్ కూడా తమ వంతు పాత్ర పోషించి జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. ఇక భారత జట్టు సాధించిన ఈ అద్భుత విజయం పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదిలాఉంటే.. చివర్లో కేఎల్ రాహుల్ అద్భుతమైన సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించిన విషయం తెలిసిందే. దాంతో టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లు, సిబ్బంది సంబరాల్లో మునిగిపోయారు. ఇక విరాట్ కోహ్లీ ఆనందానికైతే హద్దుల్లేవు. కెప్టెన్ రోహిత్‌ను గట్టిగా కౌగిలించుకుని, మైదానంలోకి పరిగెత్తాడు. బౌండరీ లైన్ వద్ద నిలబడి, స్టాండ్‌లో కూర్చున్న తన భార్య అనుష్క శర్మను చూస్తూ గెలిచేశాం అంటూ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. అనుష్క కూడా చప్పట్లతోనే కోహ్లీని అభినందించింది. ప్రస్తుతం విరుష్క జోడీ రియాక్షన్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.