USA: సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ గా పదమూడేళ్ల బాలుడు.. ట్రంప్ ఉత్తర్వుల వెనుక కారణం ఇదే..!

Why Trump Appointed 13 Year Old To US Secret Service
  • బ్రెయిన్ క్యాన్సర్ తో బాధపడుతున్న డీజే డేనియల్
  • పోలీస్ ఆఫీసర్ కావాలన్న కోరిక వెలిబుచ్చిన బాలుడు
  • సీక్రెట్ ఏజెంట్ గా నియమించిన ప్రెసిడెంట్ ట్రంప్
అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ గా ఓ పదమూడేళ్ల బాలుడిని నియమిస్తూ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఉత్తర్వులు జారీ చేశారు. సీక్రెట్ సర్వీస్ లో చేరుతున్నట్లు బాలుడు సంతకం చేసి పోలీస్ బ్యాడ్జిని అందుకోవడంతో అమెరికా కాంగ్రెస్ సభ్యులు చప్పట్లతో సంతోషం వ్యక్తం చేశారు. అయితే, ఇలా పదమూడేళ్ల బాలుడిని సీక్రెట్ సర్వీస్ లోకి తీసుకోవడం వెనుకున్న కారణాన్ని ట్రంప్ వెల్లడిస్తూ మీడియాకు ప్రకటన విడుదల చేశారు.

అమెరికాకు చెందిన పదమూడేళ్ల బాలుడు డీజే డేనియల్ బ్రెయిన్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. డేనియల్ మరో ఐదు నెలలు మాత్రమే జీవిస్తాడని వైద్యులు తెలిపారు. పెద్దయ్యాక పోలీస్ ఆఫీసర్ కావాలనేది డేనియల్ కోరిక.. డేనియల్ తండ్రి ఈ విషయాన్ని ట్రంప్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్పందించారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ గా డేనియల్ ను నియమించాలంటూ అధికారులను ఆదేశించారు.

తాజాగా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ గా డేనియల్ ప్రమాణ స్వీకారం చేసి అధికారిక పత్రాలపై సంతకాలు చేశాడు. పోలీస్ యూనిఫాం ధరించి అధికారులు అందించిన బ్యాడ్జిని అమెరికా కాంగ్రెస్ లో ప్రదర్శించాడు. దీంతో కాంగ్రెస్ సభ్యులు చప్పట్లతో సంతోషం వ్యక్తం చేశారు. సీక్రెట్ సర్వీస్ లో అతిపిన్న వయస్కుడిగా డేనియల్ రికార్డు సృష్టించాడంటూ ట్రంప్ పేర్కొన్నారు.
USA
Secret Service
13 yr old
America
Donald Trump

More Telugu News