Nagababu: ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరును ప్రకటించిన పవన్ కల్యాణ్

Pawan Kalyan announces Nagababu name as MLC Contestant
  • ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయనున్న నాగబాబు
  • నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని ఇప్పటికే ప్రకటించిన చంద్రబాబు
  • నాగబాబు మంత్రి కావడం ఇక లాంఛనమే
జనసేన నాయకుడు కొణిదెల నాగబాబు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడంలో ఫుల్ క్లారిటీ వచ్చింది. కూటమి అభ్యర్థిగా ఆయన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఆయన పేరును జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారికంగా ప్రకటించారు. తద్వారా నాగబాబు రాజ్యసభకు వెళతారని, కార్పొరేషన్ ఛైర్మన్ అవుతారని జరుగుతున్న ప్రచారానికి జనసేన ముగింపు పలికింది. నాగబాబు పేరును మంత్రిగా గతంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. కూటమికి అసెంబ్లీలో ఫుల్ మెజార్టీ ఉండటంతో మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలను కూటమి గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. 
Nagababu
Janasena
Pawan Kalyan
MLC

More Telugu News