Jayaprada: సోదరుడి గురించి చెబుతూ తీవ్ర భావోద్వేగాలకు గురైన జయప్రద

Jayaprada got emotional while speaking about his brother
  • ఇటీవల కన్నుమూసిన జయప్రద సోదరుడు
  • సోదరుడి అస్థికలు కలిపేందుకు రాజమండ్రి వచ్చిన జయప్రద
  • తన సోదరుడు ఇక్కడే పుట్టి పెరిగాడని వెల్లడి
ఇటీవల సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద సోదరుడు రాజబాబు తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. రాజబాబు హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాగా, రాజబాబు అస్థికలను తాజాగా రాజమండ్రి పుష్కర ఘాట్ లో కలిపారు. ఈ కార్యక్రమంలో జయప్రద... రాజబాబు కుమారుడు సామ్రాట్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయప్రద మీడియాతో మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగాలకు గురయ్యారు. 

"నా సోదరుడు రాజబాబు పుట్టింది, పెరిగింది, చదువుకుంది ఇక్కడే... రాజమండ్రిలోనే. నేను రాజమండ్రికి ఎప్పుడొచ్చినా రాజబాబు తోడుగా వచ్చేవాడు. గత నెలలో (ఫిబ్రవరి 27) మమ్మల్ని వదిలేసి ఈ లోకం నుంచి వెళ్లిపోయాడు. మా జీవితాల్లో ఇక ఆయన లేనందుకు ఎంతో దుఃఖం కలుగుతోంది. ఆయన కుమారుడు సామ్రాట్ ను తీసుకువచ్చి... ఆయన పుట్టిన రాజమండ్రిలోనే అస్థికలను కలిపాం. ఆ పరమ శివుడు నా సోదరుడికి మోక్షం కలిగించాలని కోరుకుంటున్నాను" అని తెలిపారు.
Jayaprada
Rajababu
Demise
Rajahmundry

More Telugu News