Atchannaidu: 'అన్నదాత సుఖీభవ' పథకంపై కీలక ప్రకటన చేసిన అచ్చెన్నాయుడు

Atchannaidu key announcement on Annadatha Sukhibhava
  • మే నుంచి 'అన్నదాత సుఖీభవ' పథకాన్న అమలు చేస్తామన్న అచ్చెన్నాయుడు
  • అర్హత కలిగిన రైతులకు రూ. 20 వేలు ఇస్తామని వెల్లడి
  • రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని వ్యాఖ్య 
మే నెల నుంచి 'అన్నదాత సుఖీభవ' పథకాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అర్హత కలిగిన రైతులందరికీ రూ. 20 వేల నగదు అందజేస్తామని చెప్పారు. కౌలు రైతులకు 'అన్నదాత సుఖీభవ' అమలుపై విధివిధానాలను ఖరారు చేస్తున్నామని తెలిపారు. 

రైతులను గత వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని... కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని చెప్పారు. వైసీపీ పాలనలో వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోయిందని అన్నారు. భూసార పరీక్షలు లేవు, వ్యవసాయ యంత్రాలు లేవు, పంటల బీమా చెల్లింపులు లేవని దుయ్యబట్టారు. తాము రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పారు. శాసనమండలిలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మరో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ... వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన 'ఆడుదాం ఆంధ్ర'లో భారీ అవినీతి జరిగిందని చెప్పారు. ఈ విషయాన్ని లోతుగా పరిశీలించడానికి ఒక ఇండిపెండెంట్ కమిటీతో విచారణ వేసి 45 రోజుల్లో నివేదిక సమర్పిస్తామని తెలిపారు.
Atchannaidu
Telugudesam

More Telugu News