Chandrababu: ఢిల్లీలో అమిత్ షా, నిర్మలా సీతారామన్ లను కలిసిన సీఎం చంద్రబాబు

CM Chandrababu met union ministers in New Delhi
  • ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు
  • కేంద్రమంత్రులతో వరుస భేటీలు
  • రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై వారితో చర్చ
  • చంద్రబాబు వెంట రాష్ట్ర ఎంపీలు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఆయనకు టీడీపీ ఎంపీలు స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లను కలిశారు. ఏపీకి చెందిన పలు అంశాలపై వారితో చర్చించారు. 

రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజనకు సంబంధించిన పెండింగ్ అంశాలు, అమరావతి, పోలవరం తదితర అంశాలపై కేంద్రమంత్రులతో మాట్లాడారు. ఈ పర్యటనలో చంద్రబాబు వెంట కేంద్రమంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు సీఎం రమేశ్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
Chandrababu
New Delhi
Amit Shah
Nirmala Sitharaman
TDP-JanaSena-BJP Alliance

More Telugu News