Mediation: మెడలో మంగళసూత్రం లేదు, నుదుటన బొట్టు లేదు... భర్తకు ఏం ఆసక్తి ఉంటుందమ్మా!: ఓ మహిళతో జడ్జి వ్యాఖ్యలు

Judge interesting comments in a mediation session
  • లింక్డిన్ లో ఓ న్యాయవాది ఆసక్తికర పోస్టు
  • వేర్వేరుగా ఉంటున్న దంపతులకు మధ్యవర్తిగా ఓ జడ్జి
  • ఓ వివాహిత ఉండాల్సిన తీరు ఇదేనా అంటూ జడ్జి ప్రశ్న 
వేర్వేరుగా ఉంటున్న దంపతుల మధ్య సఖ్యత నెలకొల్పే క్రమలో ఓ జడ్జి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నీ మెడలో మంగళసూత్రం లేదు, నుదుటన బొట్టు లేదు... నువ్వు ఇలా ఉంటే భర్తకు నీపై ఏం ఆసక్తి ఉంటుందమ్మా? అని సదరు మహిళను జడ్జి ప్రశ్నించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలను పూణేకు చెందిన న్యాయవాది అంకుర్ ఆర్ జాగీర్దార్ లింక్డిన్ లో పంచుకున్నారు. గృహ హింస కేసులో ఆ భార్యాభర్తలకు మధ్యవర్తిత్వం వహించే బాధ్యతను సదరు జడ్జికి అప్పగించారని జాగీర్దార్ వెల్లడించారు. 

"సామరస్యపూర్వక ధోరణిలో విభేదాలు పరిష్కరించుకోవాలని ఆ దంపతులకు జడ్జి సూచించారు. మెడలో మంగళసూత్రం  లేకుండా, కనీసం బొట్టు కూడా పెట్టుకోకుండా ఉన్నావు. పెళ్లయిన మహిళ ఉండాల్సిన తీరు ఇదేనా?" అని ఆ జడ్జి ప్రశ్నించారని వివరించారు. 

ఇలాంటిదే మరో మధ్యవర్తిత్వం వ్యవహారంలో కూడా సెషన్స్ జడ్జి ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్టు జాగీర్దార్ తన పోస్టులో తెలిపారు. "ఓ మహిళ సంపాదిస్తుందనుకోండి... ఆమె తనకంటే ఎక్కువ సంపాదించేవాడ్నే పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుంది. అంతే తప్ప తనకుంటే తక్కువ సంపాదించేవాడితో స్థిరపడాలని ఎప్పటికీ అనుకోదు. అదే బాగా సంపాదించే మగాడి విషయానికొస్తే... తనకంటే తక్కువ సంపాదించే, తన ఇంట్లో అంట్లు తోమే పనిమనిషిని అయినా పెళ్లి చేసుకోగలడు. చూడండి... పురుషులు ఎంత సరళంగా ఉంటారో. మహిళలు కూడా అలాగే ఉండాలి... అంతే తప్ప కరాఖండీగా ఉండకూడదు అని ఆ జడ్జి వివరించారు" అని జాగీర్దార్ పేర్కొన్నారు.
Mediation
Judge
Woman

More Telugu News