Gorantla Madhav: పోలీసు విచారణ అనంతరం చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన గోరంట్ల మాధవ్

Gorantla Madhav fires on Chandrababu after police questioning
  • ఇందిర హయాంనాటి ఎమర్జెన్సీని చంద్రబాబు గుర్తు చేస్తున్నారన్న మాధవ్
  • తప్పుడు కేసులకు వైసీపీ నేతలు, కార్యకర్తలు భయపడరని వ్యాఖ్య
  • పోలీసులు మరో నోటీసు ఇచ్చారని వెల్లడి
పోక్సో కేసులోని అత్యాచార బాధితుల పేర్లను బహిర్గతం చేశారనే కేసులో వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు విచారించారు. కాసేపటి క్రితం ఆయన విచారణ మూగిసింది. ఆయనకు పోలీసులు మరో నోటీసును ఇచ్చారు. విచారణ అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 

వైసీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని మాధవ్ మండిపడ్డారు. కేసులు పెడుతూ తమ అధినేత జగన్ ను ఆపాలని చూస్తే... సూర్యుడిని ఆపాలని చూసినట్టేనని చెప్పారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంనాటి ఎమర్జెన్సీని చంద్రబాబు గుర్తు చేస్తున్నారని అన్నారు. భావప్రకటనా స్వేచ్ఛను హరిస్తున్నారని విమర్శించారు. తప్పుడు కేసులు, బెదిరింపులకు వైసీపీ నేతలు, కార్యకర్తలు భయపడరని చెప్పారు. తనకు పోలీసులు మరో నోటీసు ఇచ్చారని... విచారణకు సహకరిస్తానని పోలీసులకు చెప్పానని తెలిపారు.
Gorantla Madhav
Jagan
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News