Nadendla Manohar: గత ప్రభుత్వం రేషన్ బియ్యం విషయంలో ఆర్గనైజ్డ్ మాఫియాను తయారుచేసింది: నాదెండ్ల మనోహర్

Nadendla Manohar slams previous govt on ration rice
  • అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి నాదెండ్ల సమాధానం
  • గత ఐదేళ్లలో 76,854 మెట్రిక్ టన్నుల బియ్యం  సీజ్ చేశారని వెల్లడి
  • కూటమి ప్రభుత్వం వచ్చిన ఆర్నెల్లలోనే 60 వేల మెట్రిక్ టన్నులు సీజ్ చేశారని వివరణ
శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆహారం, పౌరసరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ  మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానమిచ్చారు. గత ప్రభుత్వం రేషన్ బియ్యం విషయంలో ఆర్గనైజ్డ్ మాఫియాను తయారుచేసిందని ఆరోపించారు. గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో 76,854 మెట్రిక్ టన్నుల బియ్యం  సీజ్ చేస్తే..... కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే 60 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేసిందని చెప్పారు. అంతేకాకుండా వారిపై క్రిమినల్ కేసులతో పాటు పీడీ యాక్ట్ ఉపయోగించడం జరిగిందని తెలిపారు.

"రాష్ట్రంలో 2019-2024 మధ్య పౌరసరఫరాల దాడులలో 76,854 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తూ అరెస్ట్ అయిన వారి సంఖ్య 9,664 మంది. ఇందులో 148 మందిని రెండుసార్లు కంటే ఎక్కువ పర్యాయాలు అరెస్ట్ చేశారు. వీరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు జిల్లా సెషన్స్ కోర్టు ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలు ఉంటాయి. బియ్యంతో పాటు  512 వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. 

కాకినాడలో 50 వేల మెట్రిక్ టన్నులు బియ్యం జప్తు చేశారు. ఇందులో 25 వేల 386 మెట్రిక్ టన్నులు పీడీఎస్ బియ్యంగా గుర్తించారు. 13 సంస్థలపై కేసు నమోదైంది. క్షేత్రస్థాయిలో ఇప్పటికీ రేషన్ బియ్యం కోసం ఎదురుచూసే వాళ్లు ఉన్నారు. త్వరలో క్యూఆర్ కోడ్ తో కొత్త రేషన్ కార్డులు అందిస్తాం" అని నాదెండ్ల వివరించారు.
Nadendla Manohar
AP Assembly Session
Janasena
TDP-JanaSena-BJP Alliance

More Telugu News