Janhvi Kapoor: జాన్వీ కపూర్ పుట్టిన రోజు సందర్భంగా RC16 టీం నుంచి స్పెషల్ పోస్టర్

RC 16 team releases special poster on Janhvi Kapoor birthday
  • రామ్ చరణ్ హీరో ఆర్సీ16
  • కథానాయికగా జాన్వీ కపూర్
  • నేడు జాన్వీ బర్త్ డే
అందాల తార జాన్వీ కపూర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి RC 16లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఉప్పెన మూవీతో బాక్సాఫీస్ షేక్ చేసిన బుచ్చిబాబు సానా ఈ చిత్రాన్ని భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. నేడు (మార్చి 6) జాన్వీ కపూర్ పుట్టినరోజు సందర్భంగా RC 16 టీం స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. జాన్వీ కపూర్‌కు శుభాకాంక్షలను తెలియజేస్తూ మేకర్స్ సెట్ నుండి ఆమె స్టిల్‌ను రిలీజ్ చేశారు. అయితే ఇది బిహైండ్ ది సీన్‌కు సంబంధించిన స్టిల్. ఇది అఫీషియల్ లుక్ కాదు అని టీం క్లారిటీ ఇచ్చింది. మొదటి షెడ్యూల్ సమయంలో మైసూర్‌లో క్లిక్ చేసిన సాధారణ ఫోటో అని స్పష్టం చేశారు. 

జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ వచ్చినప్పుడు అందరూ మెస్మరైజ్ అవుతారని టీం అంచనాలు పెంచేసింది. నవంబర్ 2024లో మైసూర్‌లో జరిగిన మొదటి షెడ్యూల్‌లో జాన్వీ కపూర్ పాల్గొన్నారు. హైదరాబాద్‌లో తాజాగా ప్రారంభమైన కొత్త షెడ్యూల్‌లోనూ జాన్వీ కపూర్ పాల్గొనబోతున్నారు. ఈ షెడ్యూల్ 12 రోజుల పాటు కొనసాగుతుంది. హీరో, హీరోయిన్, ఇతర ఆర్టిస్టులపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

ఈ చిత్రంలో ‘కరుణడ చక్రవర్తి’ శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తుండగా, ప్రముఖ కెమెరామెన్ రత్నవేలు విజువల్స్ అందిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు RC16ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాయి.
Janhvi Kapoor
Birthday
Special Poster
RC16
Ram Charan
Sana Buchibabu

More Telugu News