Perni Nani: పేర్ని నానికి భారీ ఊరటనిచ్చిన హైకోర్టు

- గోడౌన్ నుంచి రేషన్ బియ్యం తరలించిన కేసు
- కేసులో ఏ1గా పేర్ని జయసుధ, ఏ6గా పేర్ని నాని
- పేర్ని నానికి ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి ఏపీ హైకోర్టు భారీ ఊరటనిచ్చింది. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం గోడౌన్ నుంచి తరలించిన కేసులో పేర్ని నానికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో పేర్ని నాని ఏ6గా ఉన్నారు. ఈ కేసులో ఏ1గా పేర్ని నాని భార్య పేర్ని జయసుధ, ఏ2గా మానస్ తేజ్, ఏ3గా కోటిరెడ్డి, ఏ4గా మంగారావు, ఏ5గా బాలాంజనేయులు ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే మచిలీపట్నం పీఎస్ లో పేర్ని జయసుధ విచారణకు హాజరయ్యారు. ఆమెకు కోర్టు ఇప్పటికే ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.