Bandi Sanjay: పెంచాల్సిన వేతనాలను తగ్గించడమేమిటి?: బండి సంజయ్ ప్రశ్న

Bandi Sanjay questions about outsourcing employees salaries
  • ఉద్యోగులకు డీఏలు ఇవ్వడం లేదని, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు పెంచడం లేదని విమర్శ
  • డ్రైవర్లు, వర్క్ ఇన్‌స్పెక్టర్లకు 25 శాతానికి పైగా వేతనాలు తగ్గించారని ఆగ్రహం
  • కాంగ్రెస్ ప్రభుత్వం మతిలేని చర్యలకు పాల్పడుతోందన్న బండి సంజయ్
పెంచాల్సిన వేతనాలను తగ్గించడమేమిటి ముఖ్యమంత్రి గారూ? అంటూ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగులకు డీఏలు ఇవ్వడం లేదని, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు పెంచడం లేదని విమర్శించారు.

డ్రైవర్లు, వర్క్ ఇన్‌స్పెక్టర్లకు 25 శాతానికి పైగా వేతనాలు తగ్గించడం దుర్మార్గమని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం మతిలేని చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఔట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాలను నాలుగేళ్లుగా ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గుణపాఠం చెప్పినా తీరు మారదా? అని ప్రశ్నించారు. ఔట్ సోర్సింగ్ సిబ్బందికి తక్షణమే వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.
Bandi Sanjay
BJP
Telangana
Congress

More Telugu News