Sajjala Ramakrishna Reddy: వైసీపీ ముఖ్య నేతలతో సజ్జల టెలీకాన్ఫరెన్స్... కీలక సూచనలు

Sajjala Ramakrishna Reddy teleconference with YSRCP key leaders
  • ఈ నెల 12న ఫీజు పోరు నిర్వహించాలన్న సజ్జల
  • అదే రోజున పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని ఆదేశం
  • గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ జెండా ఎగరాలన్న సజ్జల
వైసీపీ ముఖ్యనేతలతో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. పార్టీ అధినేత జగన్ నిర్ణయం మేరకు ఈ నెల 12న నిర్వహించే ఫీజు పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పారు. లక్షలాది మంది విద్యార్థులు, యువతను మోసగించిన కూటమి ప్రభుత్వంపై శాంతియుతంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. పార్టీ కేడర్ మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పారు. అదే రోజున వైసీపీ ఆవిర్భావ వేడుకలను కూడా ఘనంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. 

ఫీజు పోరు కార్యక్రమం సందర్భంగా వైసీపీ కేడర్ ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్లకు మెమోరాండం అందించాలని సజ్జల తెలిపారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని... ఈ వేడుకల్లో మన పార్టీపై ప్రజాభిమానం ఏమాత్రం తగ్గలేదనేది వెల్లడవ్వాలని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ఉదయన్నే పూర్తి చేసుకుని... ఆ తర్వాత ఫీజు పోరు కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వైసీపీ జెండా ఎగరాలని చెప్పారు.
Sajjala Ramakrishna Reddy
YSRCP

More Telugu News