Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు రంగం సిద్ధం.. ఎలాంటి పిచ్‌పై మ్యాచ్ జరుగుతుందంటే..!

ICC Champions Trophy final Semi fresh pitch to host India Kiwis Match
  • రేపు దుబాయ్‌లో భారత్-కివీస్ మధ్య టైటిల్ పోరు
  • బ్రాండ్ న్యూ పిచ్ కాకుండా సెమీ ప్రెష్ పిచ్‌ను సిద్ధం చేసిన వైనం
  • లీగ్ దశలో భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరిగింది ఈ పిచ్‌పైనే..
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య రేపు దుబాయ్‌లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, మ్యాచ్ జరిగే పిచ్‌ ఎలా ఉండబోతోందన్న దానిపై రెండుమూడు రోజులుగా పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా, దీనిపై ఒక స్పష్టత వచ్చేసింది. ‘బ్రాండ్ న్యూ’ పిచ్‌పై కాకుండా ‘సెమీ-ప్రెష్’ పిచ్‌ను సిద్ధం చేసినట్టు తెలిసింది. 

రెండువారాల క్రితం అంటే ఫిబ్రవరి 23న ఈ పిచ్‌ను గ్రూప్ స్టేజ్‌లో భారత్-పాక్ మధ్య మ్యాచ్‌కు ఉపయోగించారు. దీంతో ఇప్పుడు ఇదే పిచ్‌ను సిద్ధం చేసినట్టు సమాచారం. ఆ మ్యాచ్‌లో పాక్ నిర్దేశించిన 242 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 42.3 ఓవర్లోనే ఛేదించింది. 

 ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ చేసి తన ఖాతాలో 51వ శతకాన్ని వేసుకున్నాడు. 111 బంతుల్లో 100 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. శుభమన్ గిల్ 46 బంతుల్లో 56 పరుగులు చేశాడు.  
Champions Trophy 2025
Team India
Team New Zealand
Dubai

More Telugu News