International Women's Day: మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్, బాలకృష్ణ

Pawan Kalyan and Balakrishna wishes women on International Womens Day
  • నేడు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే
  • కుటుంబాలకు, దేశానికి మహిళలు వెన్నెముక వంటి వారన్న పవన్
  • యత్రనార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అంటూ బాలయ్య పోస్ట్ 
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హిందూపురం హ్యాట్రిక్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజాన్ని తీర్చిదిద్దడంలో, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడంలో మహిళల బలం, సహన శక్తి, భాగస్వామ్యాలను అంతర్జాతీయ మహిళా దినోత్సవం కీర్తిస్తుందని పేర్కొన్నారు. 

కుటుంబాలకే కాదు, ఎదుగుతున్న దేశానికి కూడా మహిళలు వెన్నెముక వంటి వారని పవన్ కల్యాణ్ అభివర్ణించారు. ఆమె గొప్పదనాన్ని గుర్తిద్దాం... ఆమెకు మద్దతుగా నిలబడదాం, ఆమె కలలకు చేయూతనిద్దాం... మన చర్యల ద్వారా ఆమెకు నిజమైన గౌరవాన్ని అందిద్దాం అని పిలుపునిచ్చారు. 

మరింత మెరుగైన ప్రపంచాన్ని మనకు అందిస్తున్నందుకు మహిళను గౌరవిద్దాం... మరింత ఎత్తుకు తీసుకెళదాం... ఇవాళ  ఒక్కరోజే కాదు... ప్రతి రోజూ అంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

స్త్రీ స్వభావమే ఆది మాతృత్వం: బాలకృష్ణ

యత్రనార్యస్తు పూజ్యంతే... రమంతే తత్ర దేవతాః అని మన సంస్కృతి మనకు చెబుతుందని... ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువుంటారని దీని అర్థం అని నందమూరి బాలకృష్ణ వివరించారు. స్త్రీ స్వభావమే ఆది మాతృత్వం అని అభివర్ణించారు. కుటుంబాన్ని కాపాడే బలం, సమాజంలో వెలుగులు నింపే శక్తి, భవిష్యత్ పల్లవించే ప్రేమ మహిళల గొప్పదనం అని పేర్కొన్నారు. 

"మహిళలు అమ్మగా, చెల్లిగా, భార్యగా, కూతురిగా ప్రతి రూపంలోనూ త్యాగానికి, ఓర్పుకు, ప్రేమకు మారుపేరుగా నిలుస్తారు. ఈ ప్రపంచానికి వెలుగునిచ్చే ప్రతి మహిళా స్ఫూర్తిదాయకమే. వారిని గౌరవించుకోవడం మన విధి... వారిని కాపాడుకోవడం మన బాధ్యత. ఆదరణ, అంకితభావం, అజేయ సంకల్పం గల మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు" అంటూ బాలకృష్ణ సోషల్ మీడియాలో స్పందించారు.
International Women's Day
Pawan Kalyan
Balakrishna
TDP-JanaSena-BJP Alliance

More Telugu News