Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ గెలుస్తుందా, కివీస్ గెలుస్తుందా?... చాట్ జీపీటీ, గూగుల్ జెమిని ఏం చెప్పాయంటే...!

- ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో రేపు ఫైనల్ మ్యాచ్
- దుబాయ్ లో టీమిండియా × న్యూజిలాండ్
- ఆసక్తికర అంచనాలు వెలువరించిన ప్రముఖ ఏఐ చాట్ బాట్లు
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో రేపు (మార్చి 9) దుబాయ్ లో టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే విన్నర్ ఎవరనేది అందరిలోనూ ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఈ టోర్నీలో భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ చేరగా... చివరి లీగ్ మ్యాచ్ లో భారత్ చేతిలో న్యూజిలాండ్ ఓడిపోయింది. బలాబలాల పరంగా, ఫామ్ రెండు జట్లు సమ ఉజ్జీలుగా కనిపిస్తుండడంతో... రేపటి మ్యాచ్ సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఈ అంశంపై ప్రముఖ ఏఐ చాట్ బాట్లు చాట్ జీపీటీ, గూగుల్ జెమిని, డీప్ సీక్, మైక్రోసాఫ్ట్ కో పైలెట్ స్పందించాయి.
గూగుల్ జెమిని: ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో విన్నర్ ఎవరో చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే రెండు జట్లు బలంగా కనిపిస్తున్నాయి. అయితే భారత్ కు కొద్దిగా మెరుగైన అవకాశాలున్నాయి. టీమిండియా బ్యాటింగ్ లైనప్ లో డెప్త్ కనిపిస్తోంది... మరింత విధ్వంసక శక్తిని తలపిస్తోంది. కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ వంటి ఆటగాళ్లు మ్యాచ్ ను గెలిపించగల సామర్థ్యం ఉన్నవాళ్లు. భారత బౌలర్లు గనుక క్రమశిక్షణతో బంతులేస్తే ట్రోఫీ వాళ్లదే అవుతుంది. చివరిగా నేను చెప్పేదేమిటంటే... టీమిండియానే కప్ గెలుస్తుంది.
చాట్ జీపీటీ: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ పై టీమిండియానే విజయం సాధిస్తుంది. దుబాయ్ లో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతుంది. ఈ క్రమంలో న్యూజిలాండ్ పై విజయం కూడా పెద్ద కష్టమేమీ కాదు. ఫైనల్లో విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ కీలకంగా మారతారు. అదే సమయంలో ఐసీసీ టోర్నమెంట్లలో న్యూజిలాండ్ రికార్డును తక్కువగా అంచనా వేయలేం. గత దశాబ్ద కాలంలో వారు ఐదు పర్యాయాలు అంతర్జాతీయ టోర్నీలలో ఫైనల్ కు చేరుకున్నారు. 2021లో వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ కూడా నెగ్గారు.
జట్టు సమతూకంతో ఉండడం, కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర వంటి ఆటగాళ్లు ఫామ్ లో ఉండడం... ప్రత్యర్థి జట్టుకు గట్టి సవాల్ గా మారనున్నాయి. కానీ టీమిండియా ఓ పరిపూర్ణ జట్టులా కనిపిస్తోంది. దుబాయ్ స్టేడియం పరిస్థితులు అనువుగా ఉండడంతో టీమిండియా పైచేయి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో పరిస్థితులకు అనుకూలంగా ఆటతీరు మార్చుకోవడం, అమ్ములపొదిలో ఎన్నో వ్యూహాలు న్యూజిలాండ్ సొంతం. ఈ అంశాలను లెక్కలోకి తీసుకుంటే న్యూజిలాండ్ సంచలనం విజయం సాధించే అవకాశాలున్నాయి. ఏదేమైనా ఈ ఫైనల్ మ్యాచ్ రెండు బలమైన జట్ల హోరాహోరీ పోరుకు వేదికగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.
డీప్ సీక్: టీమిండియా, న్యూజిలాండ్... ఇలా ఏ జట్టును చూసినా బలంగానే కనిపిస్తున్నాయి. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ విజేతను అంచనా వేస్తే అది ఊహాజనితంగానే ఉంటుంది. ఫలానా జట్టే గెలుస్తుందని కచ్చితంగా చెప్పలేం. వ్యూహాల పరంగా, పరిస్థితులకు అనుగుణంగా ఆడడంలో న్యూజిలాండ్ దే పైచేయి. అదే సమయంలో ఐసీసీ ఈవెంట్లలో టీమిండియా ఇటీవల కాలంలో కనబరుస్తున్న ప్రదర్శన చూస్తే... న్యూజిలాండ్ కు కష్టాలు తప్పవనిపిస్తోంది. అలాగని ఫైనల్స్ లో ప్రశాంతంగా ఆడే న్యూజిలాండ్ ను తక్కువగా అంచనా వేయలేం. వారి బౌలింగ్ దాడుల్లో సమతూకం ఉంది... తప్పకుండా భారత బ్యాటింగ్ లైనప్ పై అటాక్ చేయగలదు. ఫైనల్ మ్యాచ్ కాబట్టి... టాస్, పిచ్, ఇతర పరిస్థితులు, ఒత్తిడిని ఎదుర్కొనే తీరు మ్యాచ్ ను ప్రభావితం చేస్తాయి. ఎంత చెప్పినా టీమిండియా విధ్వంసక శక్తి ముందు న్యూజిలాండ్ సహనశక్తి నిలుస్తుందా అనేది సందేహమే.
మైక్రోసాఫ్ట్ కోపైలెట్: ఈ టోర్నీలో ఓవరాల్ పెర్ఫార్మెన్స్ చూస్తే ఫైనల్లో టీమిండియా విజయాన్ని న్యూజిలాండ్ అడ్డుకోలేకపోవచ్చు. గట్టి బ్యాటింగ్ లైనప్ తో కూడిన టీమిండియా టోర్నీలో ఇప్పటిదాకా నిలకడగా ఆడుతూ వస్తోంది. పైగా, ఈ టోర్నీలో టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదన్న విషయం గమనించాలి. ప్రపంచ స్థాయి బ్యాట్స్ మన్లు విరాట్ కోహ్లీ, శుభ్ మన్ గిల్... మహ్మద్ షమీ వంటి నాణ్యమైన పేసర్ తో భారత్ బ్యాలెన్స్ డ్ గా కనిపిస్తోంది. న్యూజిలాండ్ కూడా దుర్భేద్యంగా కనిపిస్తున్నా... గతంలో భారత్ తో ఆడేటప్పుడు తడబడింది. ముఖ్యంగా ఆసియా ఖండం పరిస్థితుల్లో భారత్ ను ఎదుర్కోవడం న్యూజిలాండ్ కు కష్టమే. అనుభవం దృష్ట్యా, పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునే శక్తి దృష్ట్యా రేపటి ఫైనల్లో టీమిండియాకే అవకాశాలున్నాయి.