Ranganna Death: ముగిసిన రంగన్న మృతదేహానికి రీపోస్టుమార్టం

Re Postmortem for Ranganna dead body completed in Pulivendula
  • వివేకా హత్య కేసులో అత్యంత కీలక సాక్షిగా ఉన్న వాచ్ మన్ రంగన్న
  • కొన్ని రోజుల కిందట అనారోగ్యంతో మృతి
  • తొలుత ఓసారి పోస్టుమార్టం... ఏమీ తేలని వైనం
  • అనుమానాలు వ్యక్తం చేస్తున్న ప్రభుత్వ పెద్దలు
  • రంగన్న భార్య కోరిక మేరకు మరోసారి పోస్టుమార్టం
  • కీలక అవయవాలు సేకరించిన ఫోరెన్సిక్ నిపుణులు
వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న వాచ్ మన్ రంగన్న కొన్నిరోజుల కిందట మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే, పోలీసు దెబ్బల వల్లే రంగన్న మరణించాడంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, రంగన్న భార్య కూడా భర్త మృతిపై అనుమానాలు వ్యక్తం చేయడంతో నేడు ఆయన మృతదేహానికి రీపోస్టుమార్టం చేశారు. 

పులివెందులలో రంగన్న మృతదేహానికి 4 గంటల పాటు రీ పోస్టుమార్టం నిర్వహించారు. ఫోరెన్సిక్ నిపుణులు రంగన్న మృతదేహం నుంచి పలు అవయవాలు సేకరించారు. ఆ అవయవాలను భద్రపరిచి పరీక్షల కోసం తరలించారు. సిట్ , రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో వైద్యులు ఈ రీ పోస్టుమార్టం ప్రక్రియను నిర్వహించారు. 

వివేకా హత్య కేసులో అత్యంత కీలక సాక్షి కావడంతో  రంగన్న మృతి చెందగానే తొలుత ఓసారి పోస్టుమార్టం నిర్వహించారు. అందులో ఏమీ తేలలేదు. కానీ, ప్రభుత్వ పెద్దలు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తుండడంతో రీ పోస్టుమార్టం చేయాలని ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాలు ఇచ్చారు.
Ranganna Death
Re Postmortem
YS Viveka Murder Case
Pulivendula

More Telugu News