Howrah Express: గూడూరు సమీపంలో విరిగిన పట్టాలు... హౌరా ఎక్స్ ప్రెస్ కు తప్పిన ముప్పు

-
ఆంధ్రప్రదేశ్ లో హౌరా ఎక్స్ ప్రెస్ కు ఆదివారం పెను ప్రమాదం తప్పింది. తిరుపతి జిల్లాలోని గూడూరు రైల్వే జంక్షన్ సమీపంలో అడవయ్య కాలనీ వద్ద రైలు పట్టాలు విరిగాయి. అదే సమయంలో హౌరా ఎక్స్ ప్రెస్ ఆ మార్గంలో వేగంగా దూసుకొస్తోంది. పట్టాలు విరిగిన విషయం గమనించిన స్థానికుడు సునీల్ సమయస్ఫూర్తితో వ్యవహరించారు. రెడ్ క్లాత్ తో రైలుకు ఎదురువెళ్లాడు. ఇదిచూసి హౌరా ఎక్స్ ప్రెస్ లోకో పైలట్ రైలును నిలిపేశాడు. దీంతో పెనుప్రమాదం తప్పింది.
గూడూరు జంక్షన్ అధికారులకు సమాచారం అందించడంతో రైల్వే సిబ్బంది అక్కడికి చేరుకుని మరమ్మతులు చేశారు. ఈ ఘటన కారణంగా ఆ మార్గంలో పలు రైళ్లు సుమారు గంటపాటు ఆలస్యంగా నడిచాయి.
గూడూరు జంక్షన్ అధికారులకు సమాచారం అందించడంతో రైల్వే సిబ్బంది అక్కడికి చేరుకుని మరమ్మతులు చేశారు. ఈ ఘటన కారణంగా ఆ మార్గంలో పలు రైళ్లు సుమారు గంటపాటు ఆలస్యంగా నడిచాయి.