Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్... టాస్ ఓడిన టీమిండియా

Team India lost the toss in Champions Trophy final match
  • నేడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ మ్యాచ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
  • ఛేజింగ్ అయినా ఫర్వాలేదన్న రోహిత్ శర్మ
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో నేడు టీమిండియా, న్యూజిలాండ్ జట్లు అమీతుమీకి సిద్ధమయ్యాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ అంతిమ పోరులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. 

కాగా, టాస్ అనంతరం టీమిండియా సారథి రోహిత్ శర్మ మాట్లాడుతూ, టాస్ ఏదైనా తాము పట్టించుకోబోమని స్పష్టం చేశాడు. మొదట బ్యాటింగా, మొదట బౌలింగా అని ఆలోచించడం లేదని, ఏదైనా ఒకటేనని అన్నాడు. గతంలోనూ తాము ఛేజింగ్ చేసి మ్యాచ్ లు గెలిచామని రోహిత్ శర్మ గుర్తు చేశాడు. అంతిమంగా ఎలా ఆడామన్నదే ముఖ్యమని అన్నాడు. టాస్ ఎలా పడినా బాధపడొద్దని డ్రెస్సింగ్ రూమ్ లోనే నిర్ణయించుకున్నామని తెలిపాడు. 

న్యూజిలాండ్ గత కొన్నేళ్లుగా మెరుగైన ఆటతీరు కనబరుస్తోందని, ముఖ్యంగా ఐసీసీ టోర్నమెంట్లలో ఆ జట్టు నాణ్యమైన ఆట ఆడుతోందని పేర్కొన్నాడు. ఇప్పుడు అలాంటి టీమ్ తో ఫైనల్ ఆడుతున్నామని, ఈ మ్యాచ్ కోసం టీమిండియాలో ఎలాంటి మార్పులు లేవని రోహిత్ శర్మ వెల్లడించాడు. 

కాగా, కివీస్ టీమ్ లో పేసర్ మాట్ హెన్రీ స్థానంలోనేథన్ స్మిత్ తుది జట్టులోకి వచ్చాడు.
Champions Trophy 2025
Final Match
Team India
New Zealand
Toss
Dubai

More Telugu News