Champions Trophy Final: కివీస్ కు కళ్లెం వేసిన బౌలర్లు... టీమిండియా టార్గెట్ ఎంతంటే...!

Team India bowlers restricts New Zealand 251 runs for 7 wickets in Champions Trophy Final
  • ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
  • 50 ఓవర్లలో 7 వికెట్లకు 251 పరుగులు చేసిన కివీస్
  • రెండేసి వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ కు టీమిండియా బౌలర్లు కళ్లెం వేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ భారీ స్కోరు సాధించకుండా భారత బౌలర్లు కట్టడి చేశారు. 

బ్యాట్స్ మెన్ ఎవరూ చెప్పుకోదగ్గ భారీ స్కోర్లు సాధించలేకపోవడంతో న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 251 పరుగులు మాత్రమే చేసింది. టీమిండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 2, వరుణ్ చక్రవర్తి 2, మహ్మద్ షమీ 1, రవీంద్ర జడేజా 1 వికెట్ తీశారు. 

కివీస్ ఇన్నింగ్స్ చూస్తే... డారిల్ మిచెల్ 63, మైకేల్ బ్రేస్వెల్ 53 (నాటౌట్), రచిన్ రవీంద్ర 37, గ్లెన్ ఫిలిప్స్ 34 పరుగులు చేశారు. విల్ యంగ్ (15), కేన్ విలియమ్సన్ (11), టామ్ లాథమ్ (14), కెప్టెన్ మైకేల్ శాంట్నర్ (8) విఫలమయ్యారు. 

మొదట్లో భారీగా పరుగులు సమర్పించుకున్న టీమిండియా బౌలర్లు... ఆ తర్వాత గాడిలో పడ్డారు. క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ న్యూజిలాండ్ ను ఒత్తిడిలోకి నెట్టారు.
Champions Trophy Final
Team India
New Zealand
Dubai

More Telugu News