Mahesh Babu: మహేశ్ బాబు-రాజమౌళి సినిమా సెట్టింగ్ వీడియో లీక్

- మహేశ్ బాబు హీరోగా రాజమౌళి చిత్రం
- ఎస్ఎస్ఎంబీ29 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్
- ప్రస్తుతం ఒడిశాలో తాజా షెడ్యూల్ చిత్రీకరణ
సూపర్ స్టార్ మహేశ్ బాబుతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఎస్ఎస్ఎంబీ29. తాజాగా ఈ చిత్రం ఒడిశాలో చిత్రీకరణ జరుపుకుంటోంది. అయితే, రాజమౌళి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఏదో ఒకటి లీక్ అవుతూనే ఉన్నాయి.
తాజాగా, సెట్టింగ్ కు సంబంధించిన విజువల్స్ బయటికి వచ్చాయి. ఆ సెట్టింగ్స్ చూస్తేనే మహేశ్ బాబుతో రాజమౌళి ఎంత పెద్ద సినిమా తీస్తున్నాడో అర్థమవుతోంది. సెట్ పై ఉన్నవారిలో ఒకరు సెల్ ఫోన్ తో ఈ వీడియో రికార్డ్ చేసినట్టు తెలుస్తోంది.
కాగా, ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకపాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. ఈ ఇంటర్నేషనల్ మూవీకి కేఎల్ నారాయణ నిర్మాత.