India: మెన్ ఇన్ బ్లూ... మీ ఆట అద్భుతం.... టీమిండియా విక్టరీపై చంద్రబాబు, లోకేశ్ స్పందన

Chandrababu and Nara Lokesh congratulates Team India victory
  • ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేత టీమిండియా
  • ఫైనల్లో న్యూజిలాండ్ పై 4 వికెట్లతో విజయం
  • టీమిండియాపై అభినందనల వర్షం
పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 నేటితో ముగిసింది. ఇవాళ జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత్ 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ను మట్టికరిపించింది. తద్వారా టైటిల్ కైవసం చేసుకుంది. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ స్పందించారు. 

"మన మెన్ ఇన్ బ్లూ టీమ్ సాధించిన అద్భుత విజయం పట్ల దేశ ప్రజలందరితో కలిసి నేను కూడా హర్షిస్తున్నాను. టీమిండియా తన అసామాన్య ప్రదర్శనతో న్యూజిలాండ్ ను ఓడించి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని చేజిక్కించుకుని మరోమారు మనందరినీ గర్వించేలా చేసింది. హార్డ్ వర్క్, అంకితభావంతో అద్బుతమైన విజయం సాధించినందుకు టీమిండియాకు శుభాభినందనలు" అంటూ చంద్రబాబు తన ప్రకటనలో పేర్కొన్నారు.

"ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో దిగ్విజయం సాధించి ఛాంపియన్స్ గా నిలిచిన టీమిండియాకు కంగ్రాచ్యులేషన్స్. మన మెన్ ఇన్ బ్లూ కుర్రాళ్లు దుబాయ్ లో జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ ను ఓడించడం ద్వారా తమ సంకల్పం, నైపుణ్యం, ఆధిపత్యాన్ని ఘనంగా చాటారు. దూకుడైన ఆటతీరుతో కెప్టెన్ రోహిత్ శర్మ శుభారంభం అందించి జట్టును ముందుండి నడిపించాడు. తద్వారా చారిత్రక విజయానికి బాటలు వేశాడు" అంటూ లోకేశ్ కొనియాడారు. 

India
Champions Trophy 2025
Chandrababu
Nara Lokesh
Team India
Dubai

More Telugu News