Champions Trophy 2025: చాంపియన్లకు అభినందనలు: రామ్‌చరణ్

Actor Ramcharan wishes Team India for Champions trophy win
  • టైటిల్ పోరులో కివీస్‌ను మట్టికరిపించిన భారత జట్టు
  • కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టు విజయానికి బాటలు వేసిన రోహిత్‌శర్మ
  • టీమిండియాపై ప్రశంసల వెల్లువ
చాంపియన్స్ ట్రోఫీ విజేత టీమిండియాపై సర్వత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ సేన 4 వికెట్ల తేడాతో విజయం సాధించి వరుసగా రెండో ఐసీసీ టైటిల్‌ను గెలుచుకుంది. భారత జట్టు విజయంపై ప్రధాని మోదీ సహా పలు రంగాలకు చెందినవారు శుభాకాంక్షలు తెలిపారు. ఇక సోషల్ మీడియా అయితే, ‘మెన్ ఇన్ బ్లూ’ సాధించిన విజయంతో సంబరాలు చేసుకుంది. 

తాజాగా, టాలీవుడ్ ప్రముఖ నటుడు రామ్‌చరణ్ టీమిండియాకు అభినందనలు తెలిపాడు. ‘ఏమి ఆట! దేశానికి విజయాన్ని అందించినందుకు చాంపియన్లకు అభినందనలు’ అని ఎక్స్‌లో పేర్కొన్నాడు.

కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు సాధించగా, అనంతరం 252 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు మరో ఓవర్ మిగిలి ఉండగానే 6 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. 76 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ద అవార్డు’ దక్కింది.
Champions Trophy 2025
Team India
Ramcharan

More Telugu News