Turkey: కిజిలెల్కా... సరికొత్త మానవ రహిత విమానాన్ని అభివృద్ధి చేసిన టర్కీ

turkey completes unmanned aircraft tests implications for india
  • మానవరహిత యుద్ద విమానం కెజిలెల్మాను తయారు చేసిన టర్కీ
  • టర్కీ డ్రోన్లతో భారత్‌కు వ్యూహాత్మక చిక్కులు
  • పాక్, బంగ్లాదేశ్ చేతిలో టర్కీ బైరెక్టర్ డ్రోన్‌లు
టర్కీ మొదటి మానవరహిత యుద్ధ విమానం కెజిలెల్మాను అభివృద్ధి చేసింది. బైరెక్టర్ డ్రోన్లను తయారు చేసిన బైకర్ కంపెనీ మొట్టమొదటి మానవరహిత యుద్ధ విమానం కిజిలెల్మాతో సిద్ధమైంది. పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో దీనిని టర్కీ రూపొందించింది. పరీక్షలో భాగంగా ఏరోడైనమిక్ సిస్టమ్ ఐడెంటిఫికేషన్ టెస్ట్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. 

పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లతో సంబంధాలు బలపర్చుకున్న టర్కీ ఈ దేశాలకు తన డ్రోన్‌లు అందించింది. టర్కీ నుంచి కొనుగోలు చేసిన బైరెక్టర్ డ్రోన్‌లను భారత సరిహద్దులో బంగ్లాదేశ్ మోహరించింది. ఈ పరిణామం భారత్‌కి వ్యూహాత్మక ఇబ్బందులను కలిగిస్తోంది. టర్కీకి భారత వ్యతిరేక దేశాలతో మంచి సంబంధాలు ఉండటంతో భారత్ కూడా తన డ్రోన్ విమానాలను సిద్ధం చేసుకుంటుంది.

బైకర్ 2023లో తన ఎగుమతుల ద్వారా రూ.1.8 బిలియన్ డాలర్లను సాధించింది. ప్రపంచంలోనే అతి పెద్ద యూఏవీ ఎగుమతిదారుగా ఉంది. ఈ సంస్థ ఆదాయంలో దాదాపు 90 శాతం ఎగుమతుల ద్వారానే వచ్చాయి. బైరెక్టర్ టీబీ 2 యూసీఏవీ డ్రోన్ల కోసం 34 దేశాలతో, బైరెక్టర్ అక్సిన్సి ఉకాన్ డ్రోన్ల కోసం 11 దేశాలు బైకర్ తో ఒప్పందాలు చేసుకున్నాయి. 
Turkey
Unmanned Aircraft
India
Pakistan
Bangladesh

More Telugu News