Nagababu: టీమిండియా విజయాన్ని జనసేన విజయంతో పోల్చిన నాగబాబు

Nagababu makes comparison between Team India victory and Janasena victory
  • ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఛాంపియన్ గా నిలిచిన టీమిండియా
  • గెలుపుకు అదృష్టంతో సంబంధం లేదని నిరూపితమైందన్న నాగబాబు
  • భారత్ ఒక్కసారి కూడా టాస్ గెలవకుండా ఏకంగా టోర్నీనే గెలిచిందని వెల్లడి
  • జనసేన ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా వంద శాతం స్ట్రయిక్ రేట్ తో గెలిచిందని వివరణ
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా విజేతగా అవతరించడం పట్ల అన్ని వైపుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. ఆయన టీమిండియా విజయాన్ని, గత ఎన్నికల్లో జనసేన పార్టీ విజయాన్ని పోల్చారు. 

గెలుపుకు అదృష్టంతో సంబంధం లేదని మరోసారి నిరూపితమైందని పేర్కొన్నారు. టీమిండియా ఈ టోర్నీలో ఒక్కసారి కూడా టాస్ గెలవకుండా ఆడిన అన్ని మ్యాచ్ లు గెలిచి 12 ఏళ్ల తర్వాత ఐసీసీ ఛాంపియన్ షిప్ సాధించిందని వెల్లడించారు. 

జనసేన పార్టీ ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా 12 ఏళ్లకు 100 శాతం స్ట్రయిక్ రేట్ తో గెలిచి రాజ్యాధికారంలో భాగస్వామ్యం సాధించిందని తెలిపారు. 

ఈ రెండింటికీ ఒకే తరహా పోలికలు కనిపిస్తున్నాయని.... ప్రణాళిక, ప్రాతినిధ్యం, కూర్పు, కసరత్తు, అంకితభావం, ఐకమత్యంతో ఈ విజయాలు సాధ్యమయ్యాయని నాగబాబు సోషల్ మీడియాలో వివరించారు.
Nagababu
Janasena
Team India
Champions Trophy 2025

More Telugu News