MLC Elections: తెలంగాణలో నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ నామినేషన్ల పర్వం

Today is last day for MLC nominations filing
  • తెలంగాణలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు
  • మార్చి 20న పోలింగ్
  • నేడు నామినేషన్లు దాఖలు చేయనున్న అభ్యర్థులు
తెలంగాణలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 20న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల దాఖలుకు నేడు చివరి తేదీ. ఎమ్మెల్యే సీట్ల సంఖ్యను బట్టి ఐదు స్థానాల్లో నాలుగు అధికార పక్షానికి, ఒకటి బీఆర్ఎస్ కు వెళతాయి. కాంగ్రెస్ పార్టీ తనకు లభించిన నాలుగు ఎమ్మెల్సీల్లో ఒక స్థానాన్ని మిత్రపక్షం సీపీఐకి కేటాయించింది. 

మిగిలిన మూడు స్థానాలకు కాంగ్రెస్ నిన్న తన అభ్యర్థులను ప్రకటించింది. విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ లకు ఎమ్మెల్సీ చాన్స్ ఇచ్చింది. సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ బరిలో ఉన్నారు. వీరు నేడు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.
MLC Elections
Nominations
Telangana

More Telugu News